ఆ కాలేజీలో సీటు సాధించిన జ‌గ‌న్ కుమార్తె

Update: 2017-06-14 09:10 GMT
పిల్ల‌లు ఏదైనా సాధిస్తే త‌ల్లిదండ్రుల‌కు క‌లిగే సంతోషం మాట‌ల్లో చెప్ప‌లేనిది. ఇప్పుడు అలాంటి ఆనందంలోనే ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. నిజానికి ఈ వార్త ఆయ‌నకు సంబంధించి చాలా భిన్న‌మైంది. జ‌గ‌న్ అన్న వెంట‌నే రాజ‌కీయాల‌కు సంబంధించిన వార్త‌లే కానీ.. ఆయ‌న కుటుంబానికి.. కుటుంబ స‌భ్యుల‌కు సంబంధించిన వార్త‌లు పెద్ద‌గా రావు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కుటుంబానికి సంబంధించిన అంశాలేవీ ఎక్క‌డా క‌నిపించ‌వు.

స‌హ‌జంగా సెల‌బ్రిటీల పిల్ల‌లు కొన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌టం.. మీడియాలో క‌నిపించ‌టం మామూలే. కానీ.. జ‌గ‌న్ కుమార్తెలు మాత్రం చాలా లోప్రొఫైల్‌ తో ఉండ‌టం.. త‌మ మీద మీడియా దృష్టి ప‌డ‌ని రీతిలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని చెబుతారు.

జ‌గ‌న్‌ కు ఇద్ద‌రు కుమార్తెలు. పెద్దామ్మాయి పేరు వ‌ర్షా రెడ్డి కాగా.. చిన్న‌మ్మాయి పేరు హ‌ర్ష రెడ్డి. వీరికి సంబంధించి అన్ని వ్య‌వ‌హారాల్ని జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తీ రెడ్డి చాలా జాగ్ర‌త్త‌గా చూస్తుంటార‌ని చెబుతారు. కుటుంబ ఫంక్ష‌న్లు త‌ప్పించి.. మిగిలిన చోట్ల ఎక్క‌డ జ‌గ‌న్ పిల్ల‌ల్లా క‌నిపించ‌కుండా ఉండ‌టం వీరి ప్ర‌త్యేక‌త‌గా చెబుతారు.

జ‌గ‌న్ ఇద్ద‌రు కుమార్తెలు చ‌దువు విష‌యంలో బ్రిలియంట్స్ గా అభివ‌ర్ణిస్తుంటారు. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా పెద్ద‌మ్మాయ్ వ‌ర్ష త‌న ప్ల‌స్ టూను గ్రాండ్ గా పూర్తి చేసింద‌ని చెబుతున్నారు. మంచి మార్కుల‌తో ప్ల‌స్ టును ఫినిష్  చేసిన వ‌ర్షా తాజాగా మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు. ప్ర‌ఖ్యాత లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో ఆమె సీటు సాధించిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ల‌స్ టూ ఎక‌నామిక్స్ లో కంప్లీట్ చేసిన ఆమె.. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో సీటు సాధించ‌టం అంత తేలికైన విష‌యం కాదు.

ఆ క‌ళాశాల‌లో సీటు సాధించ‌టం క్లిష్ట‌మైన‌దిగా చెబుతారు. అలాంటిది ప్ర‌ఖ్యాత కాలేజీలో సీటు సాధించ‌టం ద్వారా వ‌ర్షా త‌న స‌త్తాను చాటింద‌ని చెప్పొచ్చు. రాజ‌కీయ నేత‌గానే కాదు.. పారిశ్రామిక‌వేత్త‌గా సుప‌రిచితుడైన జ‌గ‌న్ వ్యాపార సామ్రాజ్యాల్ని హ్యాండిల్ చేసే వార‌సురాలిగా అవ‌త‌రించే స‌త్తా త‌న‌కుంద‌న్న విష‌యాన్ని తాజా సీటు సాధించ‌టంతో వ‌ర్షా చెప్ప‌క‌నే చెప్పింద‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కూతురు స‌త్తా విష‌యంలో జ‌గ‌న్ హ్యాపీ కావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News