ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా జరిపిన ఢిల్లీ పర్యటన ఏపీ అధికారపక్ష నేతకు కొత్త దిగులుగా మారిందన్న మాట వినిపిస్తోంది. తాను చెప్పే ఆదర్శాలకు.. చేసే పనులకు మధ్య అంతరాన్ని బట్టబయలు చేసిన జగన్ కారణంగా.. ఢిల్లీ స్థాయిలో ఆయన పరపతి దారుణంగా దెబ్బ తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ.. విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని వలవేసి తీసుకెళ్లటమే కాదు.. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేలా.. నిబంధనలకు నీళ్లు వదులుతూ మంత్రి పదవులు కట్టబెట్టటంపై జగన్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిరాయింపుదారులపై వేటు వేయాలన్న దరఖాస్తులపై ఏ విషయాన్ని తేల్చకుండా.. వారిలో కొందరికి మంత్రి పదవుల్ని అప్పగించటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉందంటూ తరచూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు లాంటి నేత.. తన మంత్రివర్గంలోకి ఫిరాయింపు దారులకు స్థానం కల్పించటంపై పలువురు జాతీయ నేతలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తొలుత బాబు తీరు గురించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేసిన జగన్ తర్వాత సమాజ్ వాదీ చీఫ్ ములాయిం సింగ్ యాదవ్.. వామపక్షనేతలతో పాటు.. బీజేపీ కీలక నేతల్ని కలిసి వారికితన వాదనను వినిపించారు.
రెండు రోజుల వ్యవదిలో పలువురు జాతీయస్థాయి నేతలతో భేటీ అయిన జగన్.. బాబు తీరు గురించి.. బాబు పాలనలో చేస్తున్న తప్పులు.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పిన తీరుతో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ఒక అవగాహన వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీతో భేటీ అయిన జగన్.. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వటం.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం అందని తీరు.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించి.. వాటి గురించి వివరించారు. అనర్హత వేటుపడే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించిన బాబు తీరుపై జగన్ చేసిన ఫిర్యాదును జైట్లీ ఆసక్తిగా విన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రెండురోజుల వ్యవధిలో జగన్ చేసిన ఢిల్లీ పర్యటన పుణ్యమా అని.. బాబు సన్నిహితులు.. స్నేహితుల నుంచి క్లాస్ పడే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. పెద్దమనిషిలా ఫోజు కొడుతూ నీతులు చెప్పే బాబు.. వాస్తవంగా అందుకు భిన్నంగా వ్యవహరించే తీరును రానున్న రోజుల్లో సందర్భానుసారంగా ప్రస్తావించి.. ఆయన నోటి వెంట మాట రాకుండా చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. చేసుకున్నోడికి చేసుకున్న మహదేవ అని ఊరికే అనరుగా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/