ఇదో జగన్ వీరాభిమాని కథ. అతనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఈసారి ఎన్నికల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తారన్న గట్టి నమ్మకం ఉంది. తన అభిమాన నాయకుడు ఎన్నికల్లో గెలుపొంది.. సీఎం కావటానికి కీలకమైన మే23వ తేదీని తన జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకునేందుకు వీలుగా తన పెళ్లిని ఫిక్స్ చేసుకున్నాడు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన చినసుబ్బారావు.. రావమ్మల కుమారుడు రామకోటయ్యకు మాదల గ్రామానికి చెందిన మాదగిరి శ్రీనివాసరావు కుమార్తె వెనీలాతో పెళ్లిని ఫిక్స్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ.. పెళ్లికి ఏం వస్తామన్న మాట రాకుండా ఉండేందుకు ప్లాన్ చేసేశాడు కోటయ్య.. పెళ్లి మండపంలో టీవీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఓ పక్క ఎన్నికల ఫలితాలు.. మరోవైపు పెళ్లి వేడుకను చూడొచ్చంటూ.. ఒక టికెట్ మీద రెండు సినిమాల రేంజ్లో బంధువులకు.. మిత్రులకు చెబుతూ శుభలేఖలు ఇస్తున్నారట. వీరి మాటతో.. తాము తప్పకుండా పెళ్లికి వస్తామని చెబుతున్నారట. అన్నట్లు.. శుభలేఖలో కూడా పెళ్లి వేడుకల్లో ఎన్నికల ఫలితాలు లైవ్ లో చూసేందుకు వీలుగా టీవీలు ఏర్పాటు చేస్తున్న వైనాన్ని కోటయ్య పేర్కొనటం గమనార్హం.