గడిచిన కొద్దికాలంగా ఏపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విశాఖ భూకబ్జాల వ్యవహారంపై ఏపీ విపక్ష నేత సేవ్ విశాఖ పేరిట భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. విశాఖ భూకబ్జా ఉదంతంలో ఏపీ అధికారపక్షానికి చెందిన నేతలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు ఏపీ సర్కారు మిత్రపక్షమైన బీజేపీ నేతలు సైతం ఈ భూకబ్జాపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయటం ఒక విశేషమైతే.. అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు ఈ దారుణంపై గళం విప్పటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. తాజాగా విశాఖలో చోటు చేసుకుంటున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన జగన్.. ఏపీ అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. అన్నింటికి మించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు.. ఏపీ మంత్రి లోకేశ్‌కు వాటాలు ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణ చేశారు.
విశాఖలో జరుగుతుఉన్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పిన జగన్.. విశాఖ భూకుంభకోణంలో మంత్రి లోకేశ్.. మంత్రి గంటాకు పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. మహాధర్నాలో మాట్లాడిన జగన్.. పలువురు బాధితుల్ని వేదిక మీదకు పిలిపించి.. వారి అనుభవాలు.. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని వారి చేతే చెప్పించారు.
తమ భూముల్ని పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను కాపాడాల్సిందిగా జగన్‌ను కోరారు. దీనిపై స్పందించిన జగన్.. ఒక్క అంగుళం భూమిని కూడా పోకుండా తాను చూస్తానని చెప్పారు. ఒకవేళ ఏదైనా జరిగితే.. తాను అడ్డుకుంటానని చెప్పారు. అయినప్పటికీ జరగరానిదిజరిగితే.. ఒక్క ఏడాది ఓపిక పట్టాలని.. ఆ తర్వాత మన ప్రభుత్వం పవర్‌లోకి వస్తుందని.. భూకబ్జాదారుల్ని తరిమితరిమి కొట్టటమే కాదు.. భూ రాక్షసులను జైల్లో పెట్టటం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు.
మహాధర్నా సందర్భంగా జగన్ ఏం మాట్లాడరన్నది చూస్తే..
+ ఈ ధర్నా చూసైనా చంద్రబాబుకు బుద్ది రావాలి. ముఖ్యమంత్రి.. మంత్రులు.. కలెక్టర్లు.. రెవెన్యూ అధికారులు కలిసి మాఫియాలా మారారు.
+ విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. అందుకే సేవ్ విశాఖ అన్న కార్యక్రమాన్ని చేపట్టాం.
+ ముదకపాకలో ల్యాండ్ ఫూలింగ్ పేరుతో భారీగా ఆసైన్డ్ భూముల్ని కొట్టేసే ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే లక్షా ఆరువేల ఎకరాల సర్వే నెంబర్లు కనిపించటం లేదని కలెక్టర్ కొత్త కథ చెబుతున్నారు.
+ హూదూద్ తుపానులో రికార్డులు పోయాయని అంటున్నారని.. మూడేళ్ల తర్వాత ఈ విషయం గుర్తుకు వచ్చిందా?
+ 16చ375 ఫీల్డ్ మెజర్ మెంట్ పుస్తకాలు కనిపించటం లేదని కలెక్టర్ అంటున్నారని.. అంటే లక్షా ఆరువేల ఎకరాలకుపుస్తకాలు కనిపించటం లేదన్న విషయం తుఫాను వచ్చిన మూడేళ్లకు గుర్తుకు రావటంలో అసలు ఉద్దేశం ఏమిటి?
+ హుదూద్‌లో కలెక్టర్ బిల్డింగులు ఎగిరిపోలేదు.. సునామీలాగా నీరు ఆఫీసుల్లోకి రాలేదు. నేనే 11 రోజులు ఇక్కడే ఉండి అన్ని ప్రాంతాల్లో తిరిగా. హుదూద్‌లో వచ్చింది గాలి వాన మాత్రమే.
+ రెవెన్యూ రికార్డుల్ని ఎలా అంటే అలా మార్చుకునేందుకే కలెక్టర్ ఈ కట్టుకథల్ని చెబుతున్నారు.
+ దాదాపు 23 వేల ఎకరాలు కబ్జా అయినట్లుగా ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని.. అలా జరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఒక్క అంగుళం భూమిని కూడా పోనివ్వం.
+ విశాఖ భూకబ్జాలో పెద్దల పాత్ర ఉందని. వైజాగ్ కుంభకోణంలో గంటా పాత్ర ఉంది. భారీ ఎత్తున భూములు కొట్టేసిన కబ్జా కోరుల నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆ డబ్బులు గంటాకు ఇంత.. లోకేశ్ కు ఇంత లెక్కన పంపకాలు జరుగుతున్నాయి.
+ ల్యాండ్ ఫూలింగ్ పేరిట భయపెట్టి.. ప్రభుత్వం సేకరిస్తే కనీసం రెండు లక్షలు కూడా ఇవ్వదని.. రైతులను భయభ్రాంతుల్ని చేసి దోచేస్తున్నారు.
+ గతతం యూనివర్సిటీ యజమాని చంద్రబాబు బంధువు కావటంతో ఆయన కబ్జా చేసిన 54 ఎకరాలను కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి ఆ భూములను అధికారికంగా ఆయనకు అప్పగించారు.
+ వైజాగ్ భూ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ తీరు ఎలా ఉందంటే..రావణాసురుడు.. సీతమ్మవారిని ఎత్తుకెళ్లాడా? లఏదా? అన్నదానిపై కుంభకర్ణుడితో సిట్ వేయించినట్లుగా ఉంది.
+ రావణాసురుడు చేసిన తప్పుపై కుంభకర్ణుడితో సిట్ వేయించకుండా ఆంజనేయుడితో సిట్ వేయిస్తే నిజానిజాలు తేలిపోతాయి.
+ వైజాగ్ జిల్లా తనకు చాలా చేసిందని చంద్రబాబు చెబుతుంటారని.. మరి అలాంటి విశాఖకు చంద్రబాబు స్కాములు.. అవినీతి.. దోచుకునేందుకు అనుమతులు ఇచ్చారు.
+ నక్కపల్లి మండలం అమలాపురంలో ప్రభుత్వ భూమిని 35మ మంది టిడిపి నేతలు ఆక్రమించారు. దర్జాగా ఆన్‌లైన్‌లో తమ పేరిట పట్టాలు సృష్టించుకున్నారు. వాళ్లందరికీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి. వారంతా బినామీలే. వారిపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదు..
+ జేపీ అగ్రహారంలో రైతుల భూములు కొల్లగొట్టి రికార్డులు తారుమారు చేశారు. పేద రైతులను బెదరగొట్టి భూములు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద మీ భూములు ఉన్నాయని చెప్పి భయపెట్టారు. భయపడని రైతుల భూముల్లో రాత్రికి రాత్రే రోడ్లు వేశారు. అదేమిటని అడిగితే ఈ భూములు మావేనని చెబుతున్నారు. జేపీ అగ్రహారం రైతులకు అండగా ఉంటాం. మేం అధికారంలోకి వచ్చాక ప్రతి అంగుళం తిరిగి ఇస్తాం. భూములు ఆక్రమించిన రాక్షసులను జైలుకు పంపిస్తాం.
+ కాపాడాల్సిన చంద్రబాబే ఒక మాఫియాగా తయారై దోచుకుని తింటుంటే అధికారులేం చేస్తారు? పొరుగు దేశంలో ఉన్నవాళ్లు మన భూములు లాక్కుంటే కాపాడుకునే యత్నం చేసేట్లుగానే మన భూములు లాక్కుంటున్న ఈ ప్రభుత్వాన్ని బంగాళఖాతంలో కలిపేయాలి. ఒక భరోసా ఇస్తున్నా. ఒక్క అంగుళం కూడా పోకుండా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా పోరాడుతుంది. మనం ఎంత పోరాటం చేసినా విజయం రాకుంటే బాధపడొద్దు.. ఏడాదిన్నర తర్వాత మన పాలనే వస్తుంది. ప్రతి అంగుళం తిరిగి ప్రతి పేదవాడికి ఇస్తాను. ఇప్పుడు అన్యాయాలు చేస్తున్న వారందని అప్పుడు జైలులో వేస్తాం
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/