ఎవరూ తక్కువ కాదన్న మాట ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని చూసిన ప్రతిఒక్కరికి అర్థమవుతుంది. అటు అధికారపక్షం.. ఇటు విపక్షం ఎవరికి వారు.. ఏ మాత్రం తగ్గకుండా పరస్పర ఆరోపణలతో విరుచుకుపడటం మామూలే. ఒకవైపు తిట్టేస్తూనే శాపాలు పెట్టటం ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేకత.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ అంశాల మీద విమర్శలతో దాడి చేసిన జగన్.. ఎమ్మార్వో వనజాక్షి మొదలు కాల్ మనీ.. డ్వాక్రా సంఘాలపై పోలీసుల దాడి తదితర అంశాల్నిప్రస్తావిస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మహిళా దినోత్సవం రోజున మాట్లాడదాం అంటూ అధికారపక్షం ఆఫర్ కు.. మీ పాలనలో మహిళల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారో చూశారా? అంటూ పాత విషయాల్ని తవ్వి తీసి కుప్పేసే ప్రయత్నం చేశారు.
జగన్ దాడికి ఆత్మరక్షణలో పడిన అధికారపక్షం ఎదురుదాడి షురూ చేసింది. బాగా సౌండ్ ఉన్న తెలుగు తమ్ముళ్లు మైక్ తీసుకొని జగన్ పై విరుచుకుపడే ప్రయత్నం చేశారు. ఇలా మాటల తూటాలు ఇరు పక్షాల నడుమ జరిగిన వేళ.. మరోసారి మైకు పొందిన జగన్ మాట్లాడుతూ.. తన నుంచి మైక్ తీసుకొని నలుగురితో తిట్టిస్తున్నారని.. తిట్టిన తర్వాత మళ్లీ మైకు ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా.. ‘‘పోనీలే పైన దేవుడున్నాడు’’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్య చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అధికారపక్షంపై దునుమాడే జగన్.. తనను విమర్శిస్తే మాత్రం.. పైన దేవుడున్నాడనటం అనటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుందేమో..?