అసెంబ్లీలో విపక్ష నేత జగన్ వాకౌట్ చేయడానికి ముందు చెప్పిన ఓ మాట ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. రుణమాఫీని తమ ప్రభుత్వ ఘన కార్యాల్లో ఒకటిగా చెప్పుకొనే చంద్రబాబు ఆ మాటతో షాక్ తినాల్సి వచ్చింది. రాష్ట్రంలో రుణమాఫీ గురించి సీఎం - మంత్రులు నిత్యం లెక్కలు చెబుతుంటారు. అయితే... జగన్ ఈ రోజు అసెంబ్లీ చెప్పిన విషయం వినగానే చంద్రబాబు చెప్పిన లెక్కలన్నీ తేలిపోయాయి. ''సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావకే రుణమాఫీ కాలేదు'' అని జగన్ చెప్పడంతో టీడీపీ వైపు నుంచి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా వైసీపీఎ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి రుణమాఫీపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానంపై జగన్ మండిపడ్డారు. ''మంత్రిగారు చెప్పే మాటలన్నీ అబద్ధాలు.. ఎన్నికల సమయంలో పంట రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. ఆ రోజు ఏ టీవీ చూసినా, ఏ గోడలు చూసినా, ఫ్లెక్సీలు చూసినా ఇవే హామీలు. కనపడవేమోనని ఫ్లెక్సీలకు లైట్లు కూడా పెట్టారు. చంద్రబాబు ఏ పబ్లిక్ మీటింగులో మాట్లాడినా ఇవే మాటలు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్రంలో 87,612 కోట్ల రూపాయల రైతు రుణాలున్నాయి. అప్పుడు ఎన్నికల్లో ఇవన్నీ మాఫీ చేస్తామన్న మాట చెప్పి నమ్మించారు. అవి కట్టొద్దంటే రైతులు రుణాలు కట్టడం ఆపేశారు. వారికి అప్పటివరకు లక్షలోపు రుణాలకు వడ్డీలేకుండా వచ్చేది. లక్ష నుంచి మూడు లక్షల వరకు ఉన్న రుణాలకు పావలా వడ్డీయే కట్టాల్సి వచ్చేది. కానీ వాళ్లు అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో అపరాధ వడ్డీ కింద 14-18 శాతం వసూలు చేస్తున్నారు. వడ్డీలు మాత్రమే 24వేల కోట్లు కట్టారు. రెండేళ్లు కలిపి రూ. 7400 కోట్లు ఇచ్చామని మంత్రి చెబుతున్నారు. అంటే వడ్డీలలో మూడో వంతు కూడా సరిపోదు. అంతెందుకు బాబుగారి బావకు కూడా రుణ మాఫీ కాలేదు'' అని జగన్ అన్నారు.
ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రత్తిపాటి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు వాకౌట్ చేస్తామని ప్రకటించారు. అయితే ఆ సమయంలో ప్రశ్నకు సంబంధించిన వివరాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతుండగా.. దానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభ్యంతరం తెలిపారు. వాకౌట్ చేస్తున్నట్లు మాత్రమే ప్రకటించాలని, దాని మీద సుదీర్ఘంగా మాట్లాడేందుకు వీల్లేదని చెప్పారు. దాంతో చివరకు.. ''ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి, ఆ తర్వాత మోసం చేసి, వాళ్ల ఆత్మహత్యలకు కారణమైనందుకు నిరసన తెలుపుతూ ఈ ప్రశ్నకు మేం వాకౌట్ చేస్తున్నాం'' అని ప్రకటించి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. జగన్ మాట్లాడలేకపోయినా ఆ ఒక్క డైలాగుతో చంద్రబాబు ఇమేజిని డ్యామేజి చేశారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.