జగన్ ఫైర్ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ఘాటు విమర్శలు చేశారు. ఎవర్ని నమ్మొద్దన్న ఆయన గత ఎన్నికల్లో నమ్మించి వెన్నుపోటు పొడిచిన నేతలంటూ మండిపడ్డారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో నడుస్తున్న ఆయన తాజాగా మాట్లాడారు. జగన్ మాటలు వినేందుకు సిక్కోలు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంత చందంగా జనసందోహం కనిపించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రజల్ని బాబు.. పవన్ లు కలిసి ఏ విధంగా మోసం చేసింది చెప్పుకొచ్చారు.
జగన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే చెబితే..
+ మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఎవరినీ నమ్మొద్దు. బిజేపీ - కాంగ్రెస్ - చంద్రబాబు - జనసేనను నమ్మొద్దు. వీళ్లంతా కూడా దగ్గరుండి గత ఎన్నికల్లో మనల్ని మోసం చేసిన వారే. ఒకరు కత్తి ఇస్తే మరొకరు చేతులు, కాళ్లు పట్టుకుంటే ఇంకొకరు కత్తితో వెన్నులో పొడిచే కార్యక్రమం చేశారు.
+ గత ఎన్నికల్లో బిజేపీ ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తానని చెబితే చంద్రబాబు దానికి వత్తాసు పలుకుతూ పది కాదు, 15 ఏళ్లు తీసుకువస్తానని మాట ఇచ్చాడు. ఇదే పవన్ కల్యాణ్ అనే వ్యక్తి వీరిద్దరికీ పూచీకత్తు నేను.. వీళ్లిద్దరితో నేను పని చేయిస్తానని చెప్పి ఓటు వేయండన్నాడు.
+ నాలుగున్నరేళ్లు అయిపోయింది. ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేసిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టకపోయి ఉండింటే అసలు ఈ పరిస్థితి మనకు వచ్చి ఉండేదే కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామనే అంశాన్ని నిజంగా చట్టంలో పెట్టి ఉంటే మనం కోర్టు దాకా వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుని ఉండేవాళ్లం. అలా చేయనందునే ఇవాళ మన బతుకులు ఇలా తగలబడ్డాయి. ఇప్పుడు మరోసారి మనల్ని మోసం చేయడానికి.. ఇది చేస్తామని అది చేస్తామంటూ మీ ముందుకు వస్తారు. వారిని నమ్మొద్దు.
+ ప్రత్యేక హోదా మనకు అవసరం. హోదాతోనే పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా ఉంటే ఆదాయపు పన్ను - జీఎస్టీ కట్టాల్సిన పనిలేదు. అందుకే కొత్త పరిశ్రమలు - కొత్త హోటళ్లు - ఆస్పత్రులు - కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి.
+ మీ అందరినీ కోరేది ఒకటే. దేవుడు ఆశ్వీరదించాలి. మీ అందరి చల్లని దీవెనలు కావాలి. ఆలయానికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా రావాలని ఒక టెంకాయ కొట్టండి. మంచి మనసుతో చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం మనం పోరాడదాం. దేవుడి దయ - మీ అందరి మద్దతుతో రేపు ప్రత్యేక హోదా మనం తెచ్చుకోగలిగితే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌లా తయారవుతుంది.
+ గడచిన 35 ఏళ్ల రాజకీయాలు చూస్తే సీట్లు - ఓట్లు తీసుకోవడంలో శ్రీకాకుళం జిల్లా టీడీపీకే నంబర్ వన్. కానీ మన ఖర్మ ఏమిటంటే అభివృద్ధిలో మాత్రం ఈ జిల్లా అన్నిటి కన్నా అట్టడుగు స్థానంలో ఉంది. ఒకసారి మాత్రం 2004లో జిల్లా ప్రజలు తమ నిర్ణయాన్ని మార్చి వైఎస్ ను గెలిపించారు.
+ ఆ తర్వాత నాన్నగారు చేసిన పనులను చూసి వైఎస్సార్ పై నమ్మకంతో మళ్లీ 2009లో జిల్లాలో పది స్థానాలుంటే 9 స్థానాలు గెలిపించారు. అప్పటి పాలన గురించి - ఆయన చేసిన అభివృద్ధి గురించి ఈ రోజుకీ ప్రజలు నాకు చెబుతున్నారంటే ఆ దివంగత నేతకు కొడుకుగా పుట్టడం పూర్వ జన్మసుకృతమని గర్వంగా చెబుతాను.
+ ఇప్పుడు ఇక్కడి ప్రజలు నావద్దకు వచ్చి చెబుతున్న మాటేమిటంటే, అన్నా.. 2014లో 10 స్థానాల్లో ఏడు స్థానాలు చంద్రబాబుకు ఇచ్చామన్నా.. ఇవి సరిపోవని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన మరో ఎమ్మెల్మేను సంతలో పశువును కొన్నట్టుగా కొన్నాడన్నా.. ఇంతమంది ఎమ్మెల్యేను పక్కన బెట్టుకుని చంద్రబాబు మా జిల్లాకు, మా నియోజకవర్గానికి, మా శ్రీకాకుళానికి ఏం చేశారన్నా.. అని ప్రశ్నించారు.
+ వంశధార ప్రాజెక్టుపై ఒడిశా రాష్ట్రంతో 55 ఏళ్లుగా తీరని వివాదం ఉంటే తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నా.. నాన్నగారు ముఖ్యమంత్రి కాగానే న్యాయపరమైన చిక్కులను తొలగించి వంశధార ప్రాజెక్టుకు 33 కిలోమీటర్లు కాలువలు తవ్వించి సింగిడి - హీరా తదితర మండలాలకు నీరు తెప్పించారు. 2005లో వంశధార ప్రాజెక్టు స్టేజ్ – 2 పనులకు రూ.930 కోట్లు కేటాయించారు. నాన్నగారు బతికుండగానే రూ.700 కోట్లు వెచ్చించి పనులు పరుగులు తీయించారు. మరో రూ.175 కోట్లు చంద్రబాబు సీఎం కాక ముందే కేటాయించారు. మిగిలిపోయిన పనులను చంద్రబాబు పూర్తి చేయకుండా అవినీతి ప్రాజెక్టుగా మార్చేశారు.
+ మిగిలిన రూ.55 కోట్ల పనులను రూ.476 కోట్లకు అంచనాలు పెంచేసి తన బినామీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీకి దోచిపెడుతున్నారన్నా.. రెండున్నర లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును దోపిడీకి గురయ్యేలా చేసి అన్యాయంగా వ్యవహరిస్తున్నా.. వంశధార వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు నేరేడు వద్ద బ్యారేజీ కట్టుకునేందుకు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా.. అంటూ స్థానికులు చెబుతున్నారు.
+ మహీంద్ర తనయ రిజర్వాయర్ పనులు నాలుగున్నరేళ్లుగా అంగుళం కూడా కదలని పరిస్థితి. ప్రజల కోసం ఏదైనా మొదలుపెడితే మధ్యలో ఆపకూడదని నాన్నగారు ఎప్పుడూ చెబుతుండే వారు. ఆయన కొడుకుగా చెప్పేదేమిటంటే వంశధార ప్రాజెక్టుకు సంబంధించి నేరుడు వద్ద బ్యారేజీ నిర్మించడంతో పాటు మిగిలిన ప్రాజెక్టులు - బ్యారేజీ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని మాట ఇస్తున్నా.
+ శ్రీకాకుళంలో స్మార్ట్ సిటీ ఎక్కడైనా కనిపించిందా? రూ.348 కోట్లు ఇచ్చారా? రూపాయి కూడా ఇవ్వలేదు. శ్రీకాకుళంలో భూగర్భ డ్రైనేజీ అన్నాడు. ఎక్కడైనా అది కనిపించిందా? రింగురోడ్డు అన్నాడు. ఎయిర్‌పోర్టు అన్నాడు. ఫుడ్ పార్కు అన్నాడు. ఇవన్నీ ఎక్కడైనా కనిపించాయా? స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్, టూరిజం సర్క్యూట్, నాగావళి, వంశధార కరకట్టల నిర్మాణం - కోడి రామ్మూర్తి స్టేడియం.. ఇవన్నీ కనిపించాయా?
+ పేదల సంక్షేమం కోసం గతంలో రెండెకరాల స్థలాన్ని ఇంతకు ముందే కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ స్థలాన్ని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్న అధ్వాన్నమైన పరిస్థితి. టీటీడీ కల్యాణ మండపం కోసం వైఎస్సార్ భూమి - నిధులు ఇచ్చారు ఇచ్చారు. నాలుగున్నరేళ్లయినా ఆ కల్యాణ మండపం కట్టలేదు. ఏసీ ఇండోర్ ఆడిటోరియంకు గతంలోనే నిధులు ఇచ్చినప్పటికీ ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు.
+ చంద్రబాబు వచ్చాక జిల్లాలో 271 ప్రభుత్వ స్కూళ్లు మూతపడితే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఏడు స్కూళ్లు మూతపడ్డాయి. జిల్లాలో 40 హాస్టళ్లను - శ్రీకాకుళం టౌన్‌లో ఒక ఎస్సీ హాస్టల్‌ను, ఒక బాలికల హాస్టల్, బందరువాని పేట వద్ద ఒక బీసీ హాస్టల్ మూసేశారు.
+ శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటీ తీరు అధ్వానం. ఈ ట్రిపుల్ ఐటీ పిల్లలను నూజివీడుకు తీసుకుపోయి అక్కడ చదివించే పరిస్థితి. రెండో సంవత్సరానికి సంబంధించిన వెయ్యి మంది విద్యార్థులను నూజివీడు నుంచి ఇక్కడకు తీసుకువచ్చి మూతపడిన ఇంజనీరింగ్ కాలేజీలో 500 మందిని పెట్టారు. మిగిలిన 500 మందిని గతంలో ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి కట్టిన ట్వంటీ ఫస్ట్ గురుకులంలో పెట్టారు. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడేనా?
+ నాన్నగారి హయాంలో శ్రీకాకుళం - చుట్టుపక్కల అక్షరాలా 11 వేల ఇళ్లు కట్టిస్తే - చంద్రబాబు పాలనలో ఇళ్ల పేరు చెప్పి స్కామ్‌లు చేస్తున్నారన్నా అని ప్రజలు అంటున్నారు. రూ.3 లక్షలు చేసే ఫ్లాట్‌ను రూ.7.80 లక్షలుగా పేదలపై భారం మోపుతున్నారు. ఇందులో లక్షన్నర కేంద్రం, లక్షన్నర రాష్ట్రం ఇస్తోంది. మిగతా రూ.4.80 లక్షల అప్పును పేద వాడు 20 ఏళ్ల పాటు నెల నెలా రూ.3వేలు.. రూ.4 వేలు చొప్పున బ్యాంకులకు కట్టాలి. ఎన్నికల వేళ ఇస్తున్న ఆ ఫ్లాట్‌లను వద్దనకుండా తీసుకోండి. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక జగన్ అనే నేను అ అప్పును మాఫీ చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నా.
+ హుద్ హుద్ తుపాను బాధితుల కోసం 192 ఇళ్లు కడితే పచ్చచొక్కాల వారికి మంజూరు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అసలు లబ్థిదారుల జాబితా కూడా బయట పెట్టడం లేదన్నా అని చెబుతున్నారు. నాలుగేళ్లుగా 189 మంది మత్స్యకారులు చనిపోతే చంద్రబాబు ఇస్తానన్న రూ.5 లక్షల నష్టపరిహారం ఒక్కరికీ ఇవ్వలేదని చెప్పారు. అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితులు నన్ను కలిశారు.
+ తిత్లీ తుపాను బాధితులను గాలికొదిలేసి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇచ్చాపురం - టెక్కలి - పలాస - పాతపట్నం నియోజకవర్గాల్లో వ్యవసాయ పంపు సెట్లకు ఇప్పటికీ కరెంటు సరఫరాను పునరుద్ధరించ లేదు. ఇదే జిల్లా నుంచి విద్యుత్ శాఖా మంత్రి కళా వెంకట్రావు ఏమీ పట్టించుకోని పరిస్థితి.
+ తిత్లీ తో రూ.3435 కోట్ల నష్టం జరిగితే అందులో కేవలం 15 శాతం అంటే రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చి, గొప్పగా ఇచ్చినట్లు అర్టీసీ బస్సులపై చంద్రబాబు ప్రచారం చేసుకుంటుండటం విడ్డూరం. ఈయన తీరు చూస్తుంటే శవాలపై చిల్లర ఏరుకుంటున్నట్టుంది.