ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత జగన్ చెలరేగిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. గడిచిన 22 నెలల్లో జరిగిన విషయాల్ని ఒకటి తర్వాత ఒకటిగా చెప్పుకొచ్చిన ఆయన.. బాబు పాలనపై సునిశిత విమర్శలు చేశారు. బాబు పాలనలో లోపాల్ని ఎత్తి చూపటంతో పాటు.. ఆయన అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. కేంద్రాన్ని డీల్ చేసే పద్ధతి ఇదా? అని ప్రశ్నించిన జగన్.. ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశ పెట్టారని.. చాలా చేస్తానని చెప్పినా ఇప్పటివరకూ చేసిందేమీ లేదని తేల్చారు.
బాబు సర్కారుపై విరుచుకుపడే క్రమంలో జగన్.. చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. చాలా చేశానని చెబుతున్న ఆయన ఏమీ చేయలేదన్న తన వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. మరి.. జగన్ ప్రసంగంలోని కీలకాంశాల్ని చూస్తే..
= ప్రతిసారీ గవర్నర్ ప్రసంగంలో బంగారం లాంటి రాష్ట్రాన్ని విడగొట్టారని అంటున్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టేది మూడో బడ్జెట్. ఇక మిగిలినవి రెండు మాత్రమే. ఇప్పటికి రెండేళ్లు అయిపోయింది. ప్రతి సందర్భంలోనూ ఏదో ఒకటి చెబుతూ కాలం నెట్టేస్తున్నారు, కథలు చెబుతున్నారు. గవర్నర్ తొలి ప్రసంగంలో ప్రత్యేక హోదా కనీసం 15 సంవత్సరాలు ఉండేలా తెస్తామని ఇదే సభలో ఆయనతో చెప్పించారు.
= పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత.. అధికార, ప్రతిపక్షాలు ఇద్దరూ కలిసి హామీలు ఇచ్చాయి. ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, పారిశ్రామికంగా ముందుకు వెళ్లేందుకు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, హైదరాబాద్ లాంటి నగరం తీసేస్తున్నారు కాబట్టి నష్టపరిహారంగా ప్రత్యేక హోదా అన్నారు. అప్పటి ప్రధానమంత్రి, కేబినెట్ 2014 మార్చిలో తీర్మానం తీసుకుని నిర్ణయం చేసి, ప్లానింగ్ కమిషన్ కు ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇప్పటికి 24 నెలలు అయ్యింది. ప్లానింగ్ కమిషన్ పోయి నీతి ఆయోగ్ వచ్చి కూడా 16 నెలలు అయ్యింది. కానీ.. జరిగిందేమీ లేదు.
= పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొడుతూ మరో హామీ ఇచ్చారు. యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు కడతామన్నారు. అవసరమైతే దానికోసం చట్టాలను సవరిస్తామన్నారు. మూడేళ్లలోనే దాన్ని పూర్తిచేస్తామని చంద్రబాబు గవర్నర్ తో చేయించిన మొదటి ప్రసంగంలో కూడా చెప్పించారు. రెండేళ్లు అయ్యింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు నత్తనడకనే నడుస్తోంది. ఇప్పుడు.. ఆ ప్రాజెక్టులో ఫేజ్ 1 పూర్తిచేస్తామని కొత్తగా చెబుతున్నారు. అది ఒకటి ఉంటుందని కూడా మాకు ఎవరికీ తెలీదు. ఎప్పటివరకు కడతారో దాన్నే ఫేజ్ 1 అంటారో, లేదా పట్టిసీమనే ఫేజ్ 1 అంటారో కూడా తెలియదు.
= ఇక్కడేమో చంద్రబాబు బీద ఏడుపులు ఏడుస్తారు.. ఢిల్లీలో మాత్రం వాళ్లను బ్రహ్మాండంగా పొగుడుతారు. ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్తారో మాకు అర్థం కాదు.. సొంతపనులు చక్కబెట్టుకోడానికి వెళ్తున్నారా, లేదా తెలంగాణలో ఓట్ల కోసం కోట్లు కేసులో ఆడియో వీడియో టేపులతో సహా పట్టుబడ్డ నేపథ్యంలో వెళ్తున్నారా అన్నది తెలియట్లేదు.
ఇంకా చదవటానికి క్లిక్ చేయండి : బాబును జగన్ ఏ రేంజ్ లో వేసుకున్నారంటే.. 2