వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధానపార్టీలు ప్రచారంలో పీక్ స్టేజీకి చేరిపోగా తెలంగాణలో తన ఉనికిని చాటుకునేందుకు ఆరాటపడుతున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జోరును పెంచింది. పార్టీ అధ్యక్షుడు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని తొర్రూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ క్రమంలో టీఆర్ ఎస్ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కేసీఆర్ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు.
ఓ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం కోసమే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని..కేసీఆర్ మోజే ఇందుకు కారణమని ఆరోపించారు. కేసీఆర్ చెప్తుంది ఒకటి, చేస్తుంది మరొకటని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని జగన్ ప్రశ్నించారు. ఇప్పటివరకు కేవలం 1600 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారంటే.. రాష్ట్ర పరిపాలన ఎంత అధ్వాన్న పరిస్థితిలో ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ 18 నెలల పాలనలో 896 ఇళ్లు మాత్రమే కట్టించారని వ్యాఖ్యానించారు. రైతుల విషయంలో కేసీఆర్ పరట్టించుకోవడంలేదని...అనేక మంది బలిదానం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 150మందిపైకి రైతులు చనిపోయారని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చి ఉంటే బాగుండేదో కూడా జగన్ సూచించారు. కేంద్రం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చి అమలుచేయలేదని పేర్కొన్న జగన్ అందుకు నిరసనగా ఎంపీలచే రాజీనామా చేయించి తద్వారా ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఉంటే ప్రజలు గర్వించేవారని చెప్పారు. అలా కాకుండా కేవలం కేసీఆర్ ఆకాంక్ష కోసం ఉప ఎన్నిక వచ్చిందని....ఈ విషయంలో టీఆర్ ఎస్ నేతలను గట్టిగా నిలదీయాలని సూచించారు.ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలను వైఎస్ అమలు చేసి చూపించారని... ఆయన స్వర్ణయుగాన్ని ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలని కోరారు. వరంగల్ ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు తమ పార్టీకే మాత్రమే ఉందని పేర్కొంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని కోరారు.