ఏపీలో ‘డమ్మీ ఎమ్మెల్యేల’ను ఫిల్టర్ చేశారా?

Update: 2020-06-23 12:10 GMT
ఏపీలో ఉన్న అధికార వైసీపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పార్టీ మీద దృష్టి పెడుతోందని అర్థం అవుతోంది. వైఎస్ జగన్ సీఎం అయిన 6 నెలల్లో ఒక మంచి ముఖ్యమంత్రి అని అనిపించుకుంటాను అని ప్రకటన ఇచ్చారు. ఆ తరువాత ఎవరు ఏమీ అనుకున్నా తను అనుకున్నది చేశాడు. ముఖ్యంగా మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్ఘీత మాదిరిగా చూసి అమలు చేశాడు. వైఎస్ జగన్ సీఎం అయిన ఒక ఏడాదిలోనే దాదాపు 90శాతం సంక్షేమ పథకాలు అమలు చేశాడు.

ఇక ఇప్పుడు పార్టీ పరిస్థితిపై వైఎస్ జగన్ పడ్డాడు. రోజుకు కొందరి చొప్పున వైసీపీ ఎమ్మెల్యేలతో భేటికి నిర్ణయించారు. వారి సాధకబాధలు వింటానని ప్రకటించారు. అంతేకాదు.. పార్టీని గాడిలో పెట్టి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సర్వే చేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలను 3 కేటగిరీలుగా చేశారంట..

ఒకటి-డమ్మీ ఎమ్మెల్యేలు అంటే పూర్తిగా పార్టీ మీద ఆధారపడి గెలిచిన వారి మీద..
రెండు-కేడర్ ను పట్టుకొని ఓట్లు వేయించుకున్న వారి మీద..
మూడు- పూర్తిగా ప్రజల్లో పట్టు ఉన్న వారి మీద.. వీళ్లు ఏ పార్టీలో ఉన్న 50వేల ఓట్లు వచ్చే ఎమ్మెల్యేలు..

ఇలా ఫిల్టర్ చేసిన జగన్ డమ్మీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకి రిపేర్ చేయడం లేదంటే..వారికి ఆల్ టర్ నేట్ చూద్దామని డిసైడ్ అయ్యాడట.. ఈ మేరకు డమ్మీ ఎమ్మెల్యేలను గుర్తించే బాధ్యతను ఒక సర్వే సంస్థకు ఇచ్చారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో డమ్మీ ఎమ్మెల్యేలు పారాహుషార్ అని వైసీపీలో చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News