ఎవరు ఎవరిని అనరాని మాట అనలేదు. బూతులు తిట్టుకోనూ లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఏపీ ప్రజల్లో ఎవరికైనా ఆవేశం రావాలన్నా.. ఆగ్రహం కలగాలన్నా.. ఆవేదన వ్యక్తం చేయాలన్నా రాజకీయ నేతల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటే తప్పించి.. ఎవరికి చురుకు తగలటం లేదు. అది అధికారపక్షమైనా కానీ ప్రతిపక్షమైనా కానీ. లీటరు పెట్రోల్ రూ.110 దాటినా కిమ్మనకుండా ఏ రోజుకు ఆ రోజు పెట్రోల్ కొట్టించుకొని బతుకుబండిని సాగించేటోళ్లు.. తాము అభిమానించే నేతల్ని ఎవరైనా ఏమైనా అంటే చాలు ఆవేశంతో ఆగమాగం అయిపోతున్నారు. ఇలాంటి వేళలో ఏపీ ప్రభుత్వ విధానాలు మారిన నేపథ్యంలో విశాఖ జ్ఞానాపురంలోని సేక్రెడ్ హార్ట్, సెయింట్ పీటర్స్ పాఠశాలల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. మారిన విధానాలతోతాము పాఠశాలల్ని నడపలేమని.. మూసివేస్తున్నట్లు చెప్పారు.
పిల్లల్ని వేరే స్కూళ్లలో చేర్పించాల్సిందిగా కోరారు. మంగళవారం నుంచి స్కూళ్లు తెరిచే ప్రసక్తే లేదని తేల్చేశారు. ఆస్తులతో పాటు.. బోధన.. బోధనేతర సిబ్బందిని తమకు అప్పజెప్పాలని ఎయిడెడ్ యాజమాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో తమ స్కూళ్లను మూసివేయాలని సేక్రెడ్ హార్ట్.. సెయింట్ పీటర్స్ పాఠశాలల మేనేజ్ మెంట్లు నిర్ణయించి.. ఆ విషయాన్ని పేరెంట్స్ కు తెలియజేశారు.
విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న పళంగా స్కూళ్లు మూసేస్తే.. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్నకు స్కూలు యాజమాన్యాలు ఏమీ చెప్పలేకపోవటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకు వచ్చారు. దాదాపు వెయ్యి మందికి పైగా తల్లిదండ్రులు.. వారి పిల్లలు ఒక్కసారిగా రోడ్డు మీదకు రావటంతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు ఇవ్వటంతో పాటు.. స్కూళ్లు తెరుస్తామన్న హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని వారు తేల్చి చెప్పారు.
ఈ ఆందోళనకు జనసేన కూడా తోడు రావటం.. ఉచితంగా పాఠాలు చెప్పే స్కూళ్లను మూసేసి.. వేలాది రూపాయిలు ఫీజులు చెల్లించే ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని చెప్పటం ఏమిటంటూ ప్రశ్నించారు. ఈ ఆందోళన గురించి తెలిసిన స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అక్కడకు చేరుకొని.. వారి ఆందోళన గురించి వాకబు చేశారు. దీనిపై వారు తీవ్రంగా ప్రశ్నించటంతో పాటు.. వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. స్కూల్ యాజమాన్యం ఎక్కువ ఫీజులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ ఎమ్మెల్యే చెప్పే ప్రయత్నం చేయగా.. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో ఆయన తగ్గాల్సి వచ్చింది.
విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో విద్యా శాఖ అధికారులు దిగి వచ్చారు. మంగళవారం నుంచి స్కూళ్లు యథావిధిగా నిర్వహించటానికి అంగీకరించటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆందోళనను విరమించారు. షాకింగ్ నిజం ఏమంటే.. ప్రభుత్వ విధానాల కారణంగా మూసివేయాలని నిర్ణయించుకున్న రెండు స్కూళ్లు చాలా పాతవే కాదు..అతి తక్కువ ఫీజుల్ని వసూలు చేస్తుంటాయి.
జ్ఞానాపురంలో సేక్రెడ్ హార్ట్ పాఠశాలను 1965లో ప్రారంభిస్తే.. సెయింట్ పీటర్స్ పాఠశాలను 1968లో స్టార్ట్ చేశారు. ఈ రెండు స్కూళ్లలో 2వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. సేక్రెడ్‌హార్ట్ పాఠశాలలో విద్యార్థుల నుంచి నెలకు రూ.100 నుంచి రూ.150 ఫీజు వసూలు చేస్తుంటారు. సెయింట్ పీటర్స్‌లో అయితే పూర్తిగా ఉచితం. ఇలాంటి స్కూళ్లను మూసివేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంత తక్కువ ఫీజులు వసూలు చేసే స్కూళ్లను పట్టుకొని.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే ఎలా అంటారని మండిపడుతున్నారు.
ఇంతకూ ఈ సమస్యలకు అసలు కారణం ఏమంటే.. విశాఖ జిల్లాలో తొమ్మిది పాఠశాలలు తమ ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పగించి.. స్కూళ్లను మూసే యాలని.. మరో 62 పాఠశాలల యాజమాన్యాలు టీచర్లు.. స్టాఫ్ ను అప్పజెప్పాలని నిర్ణయించాయి. తాజా ఆందోళన నేపథ్యంలో మరింత మంది విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్ల మీదకు రావటానికి ముందే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆందోళన సందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు.. తమకు అమ్మఒడి కావాలని అడగకపోయినా ఇస్తున్నారని.. తమకు అవసరమైన బడిని మాత్రం లాగేసుకోవటం ఏమిటి? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించటం కనిపించింది. తాజా ప్రజాగ్రహం గురించి సీఎం జగన్ ఆరా తీస్తే మంచిదన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది.