'ఎన్టీరామారావు' అసలైన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డే !

Update: 2021-05-28 11:38 GMT
ఈ రోజు స్వర్గీయ నటుడు , దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్‌‌లో లక్ష్మీ పార్వతి ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ .. ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేసేవారే ఆయనకు నిజమైన వారసులని , ఎన్టీఆర్  కడుపున పుట్టినంత మాత్రాన వారిని ఆయన వారసులు కాదన్నారు. ఆయన  ఆశయాలను అమలు చేసే వారే నిజమైన వారసులని ఆమె తేల్చి చెప్పారు. సూర్యచంద్రులున్నంతవరకు ఎన్టీఆర్  జనంతోనే ఉంటారని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను ఏపీ రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు అసలైన వారసుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అన్నారు.  ఎన్టీఆర్ ఆశయాలను అనేక సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు పరుస్తున్నారని ఆమె చెప్పారు. ఏపీ రాష్ట్రంలో జగన్  సీఎంగా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ ఛైర్మెన్ గా నియమించారు. ఎన్నికల సమయంలో కూడ ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో జగన్ నిర్వహించిన  ఆందోళన కార్యక్రమాల్లో కూడ లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. 
Tags:    

Similar News