వైసీపీలో ఒకచర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అప్పులు చేసి.. మరీ అర్హులైన పేదలకు.. లబ్ధి చేకూరుస్తున్నారు. అయితే.. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా.. అందరికీ.. అందవు. ఎందుకంటే.. వివిధ సంక్షేమ పథకాలకు వివిధ రూపాల్లో లబ్ధి దారులు ఉన్నారు. ఎస్సీలకు.. లబ్ధి చూకూర్చే పథకాలు.. బీసీలకు లబ్ధి ఇచ్చే పథకాలు.. నేతన్నలు.. రైతన్నలు.. విద్యార్థులు.. మహిళలు.. అమ్మ ఒడి.. ఇలా.. అనేక రూపాల్లో అమలు చేస్తున్న పథకాలకు.. ఆయా వర్గాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి.
అంతేకాదు.. వీటికి కూడా అర్హులై ఉండాలి. ప్రతి ఒక్కరినీ అర్హులుగా తీసుకునే పరిస్థితి లేదు. అంతేకాదు.. ఆయా పథకాలను కూడా ఆచి తూచి అమలు చేస్తున్నారు. ఇంత పకడ్బందీగా అమలవుతున్న ఈ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నామని.. ప్రభుత్వం చెబుతోంది. ఇక, వైసీపీ నాయకులు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. అంతాబాగానే ఉంది. అయితే.. ఇప్పుడు.. అర్హతతో సంబంధం లేకుండా.. సామాజిక వర్గంతో సంబంధం లేకుండా.. అన్ని పథకాల్లోనూ లబ్ధి పొందుతున్నవారు ఒకరుఉన్నారని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాష్ట్రం ఎలాంటి పథకం అమలు చేసినా.. ఏరూపంలో సంక్షేమాన్ని ఇచ్చినా.. వెంటనే.. దీనితాలూకు లబ్ధి.. వైసీపీ అనుబంధ పత్రిక, మీడియాకు వెళ్లిపోతోందని..జగన్ మీడియా పండగ చేసుకుంటోందన్నది.. వీరి టాక్! ఎలాగంటే.. పథకం ఏదైనా.. లబ్దిదారులుఎవరైనా.
ప్రభుత్వం ఎంపిక చేయాలి.. వారికి నగదు అందాలి. అయితే.. జగన్ మీడియాకు మాత్రం ఏ పథకం వచ్చినా.. లబ్ధిదారే. పరోక్షంగా జగన్ కుటుంబమే ప్రధమ లబ్ధిదారుగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం బటన్ నొక్కేందుకు సీఎం జగన్ ఆళ్లగడ్డ వెళ్లారు.
ఈ క్రమంలో ఆయన తన పత్రికకు కోటి రూపాయలపైగానే యాడ్ ఇచ్చుకున్నారు. సో.. దీనిని బట్టి.. రైతులకు వచ్చేది 2000 అయితే.. జగన్ పత్రికకు.. ప్రత్యక్షంగా.. ఆయన కుటుంబానికి పరోక్షంగా అందే సాయం.. కోట్లలోనూ ఉంటోందని.. నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. దీనిపైనే వైసీపీ నాయకులు దృష్టి పెట్టారు. అయినా.. ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో ఈ కామెంట్లకు చెక్ పెట్టలేమా? అంటూ.. వారు ప్రశ్నిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.