ఒకటి తర్వాత ఒకటి చొప్పున వేగంగా సంక్షేమ పథకాల్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. వాటిని విజయంతంగా అమలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా మధ్యతరగతి వారి మీద తన ఫోకస్ ను పెట్టారు. మధ్యతరగతి వారి కష్టాల్ని తీర్చేందుకు భారీ ప్లానింగ్ ఒకటి సిద్ధం చేశారు. మధ్యతరగతి జీవుల సొంతింటి కలను తీర్చేందుకు ఆయన కొత్త ప్రోగ్రాంను షురూ చేయనున్నారు.
లాభాపేక్ష లేకుండా.. మధ్యతరగతి వారికి సరసమైన ధరల్లోనే ప్లాట్లు అందేలా చేయాలన్నది సీఎం జగన్ ఆలోచనగా చెబుతున్నారు. తాజాగా క్యాంప్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ పెట్టుకున్న సీఎం.. స్మార్ట్ టౌన్ షిప్ లో మౌలిక సదుపాయాలపై అధికారుల ప్రతిపాదనను పరిశీలించి.. కొన్ని మార్పులు.. చేర్పులుచేశారు. పట్టణాల్లో.. నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అత్యున్నత జీవన ప్రమాణాలు కల్పించటానికి కొత్త టౌన్ షిప్ లనుఏర్పాటు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు.
ఎలాంటి వివాదాలు లేని.. ఇబ్బందులు చోటు చేసుకోని.. అన్ని అనుమతులతో క్లియర్ టైటిల్ తో లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు మధ్యతరగతికి అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో ఉన్న సీఎం జగన్.. అందుకు తగ్గట్లు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతగా 12 పట్టణాల్లో 18 లే అవుట్లు వేయాలని నిర్ణయించారు. పట్టణాల చుట్టూ రింగు రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. భూములు ఇచ్చిన వారికి.. ప్రభుత్వానికి ఉభయతారకంగా ప్రయోజనం కలిగించేలా రింగు రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు ఉంటాయని చెబుతున్నారు.
నగరాలు.. పట్టణాల్లో జనాభా ప్రతిపాదికన కనీసం 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకుస్మార్ట్ టౌన్స్ ను రూపొందించాలని భావిస్తున్నారు. పనులు ప్రారంభించిన 18 నెలల్లోనే లే అవుట్స్ ను సిద్ధం చేసేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు దన్నుగా నిలిచే సీఎం జగన్ కొత్త ప్లాన్ రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారుతుందని చెబుతున్నారు. చూడాలి మరేం జరుగుతుందో?