ఆ ఇంట‌ర్వ్యూతో జ‌గ‌న్‌ కు లింకేం లేదు

Update: 2017-04-08 06:30 GMT
ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌ రెడ్డి ఇంటర్య్యూను సాక్షి చానెల్ ప్రసారం చేసిన నేపథ్యంలో వైసీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ జగన్ బెయిల్‌ ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి జగన్ వివరణ సమర్పించారు. సాక్షి టీవీకి-జగతి పబ్లికేషన్స్‌కు సంబంధంలేదని తెలుపుతూ ఆయన అఫిడవిట్‌ ను సమర్పించారు. ఇందిరా టెలివిజన్స్‌ లో భాగమైన సాక్షి టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలు తన ఆధీనంలో ఉండవని తెలిపారు. కార్యక్రమాలకు ఎడిటోరియల్ బోర్డు నేతృత్వం వహిస్తుందని చెప్పారు.

కోర్టులో పెండింగ్‌ లో ఉన్న కేసులపై ఇంటర్వ్యూలో రమాకాంత్‌ రెడ్డితో ప్రస్తావించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచార‌ణ సంద‌ర్భంగా పత్రికా స్వేచ్చ‌కు అనుగుణంగానే ఇంటర్వ్యూను సాక్షి తీసుకున్నట్టు జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు తెలిపారు. ఎక్కడా కూడ ఆస్తులకు సంబంధించిన కేసులను ప్రస్తావించలేదని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వివ‌ర‌ణ ఇచ్చారు. తమ క్లయింట్ కేసును ప్రభావితం చేస్తున్నారంటూ చేసిన వాదనలో వాస్తవం లేదన్నారు. కాగా, తదుపరి విచారణను ఈ నెల 21కి కోర్టు వాయిదా వేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News