ఏపీ సీఎం జగన్ పట్ల.. ఆ పార్టీ నాయకులు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు స్వామి భక్తి ప్రదర్శించడం తెలిసిం దే. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆమె పార్టీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. వంగి వంగి దణ్ణాలు పెట్టేవారు. ఏపీలో అదొక్కటే తక్కువ. కానీ.. అంతకు మించి అన్నట్టుగా ఎమ్మెల్యేలు ఎవరూ నోరు విప్పరు. ఏం జరిగినా.. మాట్లాడరు. అయితే.. తన విషయంలో ఇంత స్వామి భక్తి ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యేల కు తాను ఏం చేశారనేది జగన్‌కు మాత్రమే తెలియాలి.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యా ప్తంగా జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలు తీరుపై ఆయన వారితో చర్చిం చారు. దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల్లో టికెట్ల విషయం మీ చేతుల్లోనే ఉంటుందని తేల్చి చెప్పేశారు. బాగా పనిచేసిన వారికి మాత్రమే టికెట్లు ఇస్తానని.. కరాఖండీగా చెప్పేశారు. అయితే.. ఈ సమావేశానికి ముందు.. తాడేపల్లి ప్యాలెస్‌లో ఓ వింత ఘటన జరిగిందని.. తాడేపల్లి వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఆయనకు వంగి వంగి దణ్ణా లు పెట్టేందుకు.. పాద పూజలు చేసుకునేందుకు ప్రయత్నించారట. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందో లేదో.. అని ఒకింత ఆందళనలో ఉన్న వారు.. ఈ ప్రసన్న రాజకీయాలకు తెరదీశారని తాడేపల్లి వర్గాలే గుసగుసలాడుతున్నాయి. సీఎం జగన్ సమావేశానికి రమ్మన్నారనగానే.. సీమ ప్రాంతానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు.. గజ మాలలు తీసుకువచ్చారట.
ఇక, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి ఏకంగా.. పాదనమస్కారానికి(ఈయన ఇటీవల సీనియర్ నాయకుడికి బహిరంగ వేదికపైనే పాదనమస్కారం చేసి.. వివాదాలు ఎదుర్కొన్నారు) రెడీ అయ్యారట.
అయితే.. చివరి నిముషంలో.. జగన్ ఈ ఏర్పాట్లను గమనించి.. వద్దని వారించడంతో.. వారు వెనక్కి తగ్గారని.. లేకపోతే.. తాడేపల్లి ప్యాలెస్ కాస్తా.. తాడేపల్లి మఠం అయిపోయేదని వైసీపీ వర్గాల్లోనూ గుసగుస వినిపిస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. నాయకుల్లో భక్తి చెలరేగిపోతోందనడానికి నిన్నటి ఘటనను ఉదాహరణగా చెబుతున్నారు.