దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆప్తుల జాబితా తీస్తే మొదట కనిపించే పేరు కేవీపీ రామచందరరావు అయితే రెండో పేరు ఉండవల్లి అరుణ్ కుమార్ అనడంలో సందేహం లేదు. వైఎస్ ప్రత్యర్థిగా భావించిన రామోజీ రావుపై ఉండవల్లి చేసిన పోరాటం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ మార్క్ రాజకీయాల్లో వైఎస్ లాంటి డైనమిక్ సీఎం అనుచరుడిగా ఉండి అనంతరం సైడ్ అయిపోవడం కూడా ఉండవల్లికే చెల్లింది. అయితే ఉండవల్లి ఇపుడు వైఎస్ తనయుడు జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరబోతున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. తాజాగా జరిగిన పరిణామాల అందుకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి.
ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ తల్లి మరణించారు. అయితే తాజాగా రాజమండ్రిలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ అక్కడికి చేరుకోగానే వెంటనే ఉండవల్లి నివాసానికి వెళ్లారు. ఆయన్ను ఆత్మీయంగా కౌగలించుకొని ఓదార్చారు. కొద్దిసేపు ఉండవల్లితో మాట్లాడి అనంతరం కొద్దికాలం మరణించిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ బయల్దేరారు. ఇదిలాఉండగా జగన్ హఠాత్తుగా ఉండవల్లి ఇంటికి స్వయంగా వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పరిణామం ఉండవల్లి వైసీపీలోకి వెళ్తారనేందుకు నిదర్శనమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కొద్దికాలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కంటే తటస్తుడిగా కనిపించేందుకే ఉండవల్లి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ బలహీనపడిన నేపథ్యంలో వైసీపీ వైపు ఉండవల్లి చూపు మరలిందనే టాక్ నడిచింది. ఒకవేళ ఉండవల్లి వైసీపీలో చేరితే తన తండ్రి సమకాలికుడు కాబట్టి జగన్ కీలకనేతగా గుర్తించే అవకాశం ఉందని అంటున్నారు.