ఏపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ ఏపీలోనూ వ్యాపిస్తుండడంతో సీఎం జగన్ సంచలన నిర్ణయాలను ఆదివారం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఈసీ ఈ మేరకు కొద్ది సేపటి క్రితమే నిర్ణయం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో అన్ని రాష్ట్రాలు మార్చి 31వరకు సెలవులుచ్చాయి. వాటిని అనుసరిస్తూ సీఎం జగన్ ఏపీ మినీ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. తాజాగా సీఎం జగన్ ఏపీలో ఆదివారం నుంచి పూర్తి స్థాయి ఎమర్జెన్సీ గా ప్రకటించారు.
ఏపీ సర్కారు తాజాగా అన్ని జిల్లాల్లోని స్కూళ్లు - కాలేజీలు - సినిమా థియేటర్లు - ఫంక్షన్ హాళ్లను మూసివేతకు ఆదేశాలిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువరించేందుకు నిర్ణయించింది.
కేంద్రం, తెలంగాణ సర్కారు ముందస్తు చర్యల దరిమిలా కరోనా వ్యాప్తి నివారణపై సీఎం జగన్ సీఎం క్యాంప్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. ఏపీలో 70 అనుమానిత కేసులు నమోదయ్యాయయని.. ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైందని అధికారులు సీఎం జగన్ కు నివేదించారు.ముందు జాగ్రత్త చర్యగా ఏపీలో షట్ డౌన్ విధించడమే ఉత్తమమని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. ఆదివారం గవర్నర్ హరిచందన్ తోనూ సీఎం జగన్ సమావేశమై పరిస్థితిని వివరించారు.