వరుస భేటీలతో ఢిల్లీలో జగన్ బిజీబిజీ

Update: 2019-08-07 08:13 GMT
విదేశీ పర్యటన ముగించుకొని దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం ప్రధాని మోడీతో భేటీ అయిన ఆయన ఏకంగా 45నిమిషాల పాటు గడిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ డిమాండ్లను ప్రధాని ముందుకు తీసుకొచ్చారు.  ప్రత్యేక హోదా అవసరాన్ని చెప్పటంతో పాటు.. ఆ దిశగా ప్రధాని నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని కలిశారు. పలు అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు పలువురు పాల్గొన్నారు.

ఏపీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టులను మోడీ ముందు పెట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కేంద్ర సర్కారు సానుకూలంగా స్పందిస్తుందన్న భావనలో ఉన్నారు. తాజాగా రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతితో భేటీ అయిన జగన్ వెంట పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఆదాల ప్రభాకర్ రెడ్డి.. నందిగం సురేశ్.. బాలశౌరిలు పాల్గొన్నారు. రాష్ట్రపతి కోవింద్ తోనూ.. ఉప రాష్ట్రపతి వెంకయ్యతోనూ ఆయన అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News