గత కొద్దికాలంగా స్తబ్దుగా నడుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆస్తుల జఫ్తు చేశారు.
జగన్ అక్రమాస్తుల కేసులో రూ.7.85కోట్లకు చెందిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జఫ్తు చేసింది. వైఎస్ హయాంలో మేళ్లు పొందిన పెన్నా సిమెంట్స్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి.. ప్రయోజనాలు పొందిన నేపథ్యంలో అందుకు బదులుగా జగన్ సంస్థల్లో రూ.65కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈడీ.. ప్రతాపరెడ్డికి చెందిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. తాజాగా ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో.. అనంతపురం జిల్లాలో ఆ సంస్థకున్న 231 ఎకరాల భూమితో పాటు.. హైదరాబాద్‌లోని ఒక హోటల్.. బంజారాహిల్స్ లోని ఒక బంగ్లాను ఈడీ అధికారులు అటాచ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలలుగా పెద్దగా కదలిక లేదన్న వాదన నేపథ్యంలో.. తాజాగా పెన్నా సిమెంట్స్ అధినేత ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం కాస్తంత కలకలం రేగింది.