ఏపీలో టీడీపీ సర్కార్ కొలువుదీరి రెండేళ్లు దాటుతున్న నేపథ్యంలో ప్రజాసమస్యలపై పోరుతో జనంలో పట్టుసాధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తోంది. ఇదంతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ద్వారానే సాధ్యమన్న నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెల 8వ తేదీన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పుష్కరించుకొని పార్టీని గడప గడపకు తీసుకెళ్లే కార్యక్రమం ద్వారా బలోపేతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవతంచేయడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ కార్యక్రమాన్ని తేలికగా తీసుకోకూడదని ఇప్పటికే హెచ్చరించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ చేపట్టే గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా ఈ కార్యక్రమం విఫలమైందన్న వార్తలు వస్తే సహించేది లేదని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత పార్టీ నియోజకవర్గ సమన్వకర్తలపై - పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లపై ఆయన పెట్టారు. తద్వారా ఆయన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సందర్భాలలో పార్టీ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలు అక్కడక్కడా పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు - సమన్వయ కర్తల లోపం వల్ల విజయవంతం కాలేకపోతున్నాయని పార్టీ అధినాయకత్వం దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ క్షేత్రస్థాయి నేతల పనితీరుపై దృష్టిసారించేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలను తేలికగా తీసుకొనే నేతలను బాధ్యతల నుంచి పక్కనెట్టాలని కూడా జగన్ యోచిస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి స్థానికంగా పార్టీ పట్టిష్టంగా లేకపోవడమేనని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ దిశగా చర్యలు తీసుకొంటోంది. పార్టీ క్షేత్రస్థాయిలో నేతలున్నా వారు సరైన రీతిలో బాధ్యతలు నిర్వహిస్తేనే పార్టీ ప్రజానికంపై ముద్రవేయగలదని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీపైనా విమర్శలు చేసే టిడిపి నేతల విమర్శలకు ప్రతి విమర్శలు చేయడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు ఎత్తిచూపినప్పుడే ప్రజానికం మనస్సును చూరగొట్టామని వైసిపి అధినాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం కోసం జగన్ గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.