విపక్షంగా వ్యవహరిస్తున్న ఏపీలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఎంతన్నది సందేహం. అలాంటిది పెద్దగా ఉనికి కూడా లేని తెలంగాణలో జగన్ బాబు.. వరంగల్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించటం గమనార్హం.
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కు తెలంగాణలో ఎంత బలం ఉన్నదన్నది ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్ని చూస్తేనే తెలుస్తుంది. అలా గెలిచిన వారు సైతం.. పార్టీని విడిచి పెట్టి తెలంగాణ అధికారపక్షంలో చెట్టాపట్టాలు వేసుకున్న పరిస్థితి.
ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా ఉంటూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్షానికి అండగా నిలుస్తూ నిర్ణయం తీసుకున్నజగన్ బాబు.. తాజాగా వరంగల్ ఉప ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. జగన్ నిర్ణయం చూస్తుంటే.. అధికారపక్షానికి లబ్థి చేకూరేలా ఉందన్న మాట వినిపిస్తోంది.
జగన్ బ్యాచ్ అభ్యర్థి బరిలో ఉంటే అధికారపక్ష ఓటు బ్యాంక్ కు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఏదైనా అయ్యిందంటే విపక్షాలకు చెందిన ఓట్లు ఎన్నోకొన్ని కొల్లగొట్టే అవకాశం ఉంది. విపక్షాల ఓట్లు చీల్చటమే తప్పించి.. అధికారపక్షానికి ఏ మాత్రం నష్టం వాటిల్లని విధంగా జగన్ తాజా నిర్ణయం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. మొత్తానికి రహస్య స్నేహితుడికి లబ్థి చేకూరేలా