జ‌గ‌న్ పాంప్లేట్ ఓకే... మీరు ఏం చెబుతారు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు?

Update: 2022-04-27 01:30 GMT
ఏపీలో ఎన్నిక‌ల వేడి అప్పుడే రాజుకుంది. నిజానికి సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చేందుకు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉంది. అయిన‌ప్ప‌టికీ... అధికార‌, ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఎన్నిక‌ల వేడిని రాజేశాయి. పోనీ.. ముంద‌స్తు ఏమైనా జ‌రుగుతుందా? అంటే.. దీనికి సంబంధించిన సంకేతాలు మాత్రం రావ‌డం లేదు. కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మే వినిపిస్తున్నాయి.ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ దూకుడు చూస్తే.. ఎందుకో..ఏమో గానీ..ప్ర‌శాంత్ కిశోర్ ఇచ్చిన రిపోర్టుతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు,, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఉన్న బంధం తెగిపోయింద‌ని.. అందుకే మ‌ళ్లీ కార్య‌క‌ర్త‌ల బంధం పెంచుకోవాల‌ని.. ఆయ‌న భావిస్తున్నారు.

అంటే.. గ్రామాల్లోకి వెళ్లాల‌ని.. పీకే ఇచ్చిన స‌ల‌హా ప్ర‌కారం.. జ‌గ‌న్ త‌న ప్లాన్ వేగం పెంచారు. అయితే.. ముంద‌స్తు ఎన్నిక‌ల కోసమా?  లేక‌..కార్య‌క‌ర్త‌ల అసంతృప్తి త‌గ్గించ‌డం కోస‌మా? అనేది తేలాల్సి ఉంది. అయితే.. ఏదేమైనా.. జ‌గ‌న్ మాత్రం పొలిటిక‌ల్ హీట్ పెంచాడ‌ని అంటున్నారు.  ఏపీలో ఇప్పుడు వైసీపీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు గానీ.. స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచిన ప్ర‌జాప్ర‌తినిదులు ఇలా మొత్తంగా 85 శాతం మంది ఉన్నారు. అయినా.. వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టి.. ప్ర‌బుత్వం కేవ‌లం గ్రామ వ‌లంటీర్స్ మీద ఆధార‌ప‌డి సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తోంది.

దీనికి స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు బాగా ఫీల్ అవుతున్నార‌ని.. సంక్షేమ ప‌థ‌కాలు తీసుకున్న‌వారిలో.. జ‌గ‌న్ మీద‌ మంచి అభిప్రాయం ఉంది అని..కానీ, తీసుకోనివారు.. ప్ర‌బుత్వం నుంచి ఎలాంటి ల‌బ్ధి పొంద‌ని వారు.. మాత్రం అభివృద్ధి, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు.. విపరీతంగ పెరిగిపోవ‌డం.. రోడ్లు, ఉపాధి క‌ల్ప‌న‌, నిరుద్యోగం, ఇలా.. అనేక విధాలుగా.. ప్ర‌భుత్వం తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. అందుకే వీరు జ‌గ‌న్ స‌ర్కారు పై పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేద‌ని.. ప్ర‌శాంత్ కిశోర్ ఇచ్చిన నివేదిలో తేలింద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

అయితే.. సంక్షేమ ప‌థ‌కాలు తీసుకున్న‌వారు.. హ్యాపీగా ఉన్న‌ప్ప‌టికీ.. వారు మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చి సీఎం జ‌గ‌న్ బాగా పాలిస్తున్నాడు.. అంటూ ఒక్క‌ మాటంటే ఒక్క మాట కూడా అన‌డం లేదు.  కాబ‌ట్టి జ‌గ‌న్ దాదాపు ల‌క్ష 36 వేల కోట్లు సంక్షేమ రూపంలో ప్ర‌జ‌ల‌కు పంచినా.. గ్రామాల్లో మాత్రం ఆయ‌న ఆశించిన విధంగా ప్ర‌చారం అయితే.. లేదు. ఇక‌,, వైసీపీ వాల్లు కూడా దీనిని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డం లేదు. ఎందుకంటే.. వైసీపీకి ఎంత చేసినా.. త‌మ‌కు ప్ర‌యోజ‌నం లేద‌ని.. కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. వారికిప్ప‌టి వ‌ర‌కు ప్ర‌బుత్వం ఏర్ప‌డి మూడేళ్ల యినా.. ఒక్క‌రూపాయి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు.

అంతా కూడా వలంటీర్ల‌తోనే ప‌నిచేయిస్తున్నారు. అంతే కాదు... ముఖ్య‌మంత్రి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే లు, అధికారులు.. స‌ర్పంచులు.. అంద‌రూ కూడా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పైనే ఆధార‌ప‌డ్డారు. ఈ కార‌ణంగా.. రాజ‌కీయ నేత‌ల‌కు.. త‌మ‌కు కూడా విలువ లేకుండా పోయింద‌ని కార్య‌క‌ర్త‌లు ఆవేఏద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  ఇదిలావుంటే.. మే 1 నుంచి 'గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీసీ' అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి ప‌క్కా ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జుల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపించ‌నున్నారు.

ఇలా.. హైక‌మాండ్ నుంచి ప‌క్కా ప్లాన్‌తో కూడిన ఆదేశాలు కూడా వ‌చ్చాయి. ఇక‌, ఈ కార్య‌క్ర‌మానికి సంబం ధించి సీఎం జ‌గ‌న్ ఒక పాంప్లేట్.. ఇస్తార‌ని, ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా.. స‌ద‌రు పాంప్లేట్‌ను ప్ర‌జ‌ల కు ఇవ్వాలంట‌. అయితే.. దీనిలో ప్ర‌బుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల న‌నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు బాగానే ఉంది. కానీ.. లోక‌ల్ ఎమ్మెల్యేని ప్ర‌జ‌లు, ట్యాక్స్ పేయ‌ర్లు.. కూడా మీరు ఏం చేశారు? ఒక్క రోడ్డు వేశారా? ఒక అభివృద్ధి ప‌ని చేశారా? అని నిల‌దీస్తే.. ఏం చెబుతారు?

ముఖ్యంగా ప్ర‌స్తుతం క‌రెంటు కోత‌లు.. చార్జీల పెంపు.. బ‌స్సు చార్జీల పెంపు.. ప‌న్నుల పెంపు, చెత్త‌పై ప‌న్ను ఇలా అనేక పెంపుల‌పై ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న వ్య‌క్తం అయితే.. ఎమ్మెల్యేలు ఏం చేయాల‌ని.. మ‌ద‌న ప‌డుతున్నారు. ఇదే విష‌యం ఇప్పుడు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.   మ‌రి దీనికి వారు ఎలాంటి స‌మాధానం చెబుతారోచూడాలి.
Tags:    

Similar News