ఏపీ కేబినెట్ సమావేశం జరగటం.. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు కేబినెట్ సమావేశ మందిరలోకి అడుగు పెట్టే ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇద్దరు మంత్రుల్ని చూసినంతనే ఆగి మరీ వారిని కుశల ప్రశ్నలు వేసిన వైనం చోటు చేసుకుంది. ఏపీ మంత్రుల్లో ఇద్దరు కరోనా పాజిటివ్ కావటం.. కోలుకోవటం తెలిసిందే.
సమావేశ మందిరంలోకి అడుగు పెట్టే ముందు తనకు కనిపించిన మంత్రి బాలినేని శ్రీనివాస్ ను చూస్తున్నంతనే.. ఏం శీనన్నా బాగున్నావా? కరోనా నుంచి కోలుకున్నావా? సింప్టమ్స్ ఏమిటి? జ్వరమేనా? ఇంకేమైనా లక్షణాలు కనిపించాయా? అని అడిగినట్లు తెలుస్తోంది. తనకు జ్వరమే కనిపించిందని.. ఆయాసంతో బాధ పడలేదని బాలినేని వివరించారు. అంతా బాగుంది కదా? ఎలాంటి సమస్యలు లేవు కదా? అని అడిగారు. కాస్త ముందుకు అడుగు వేయగానే ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కనిపించారు.
ఆయన్ను చూస్తున్నంతనే..నవాబ్ సాబ్ ఎలా ఉన్నారు? కరోనా నుంచి కోలుకున్నారా? అని ప్రశ్నించారు. జ్వరమేనా? ఇంకేమైనా లక్షణాలు కనిపించాయా? అని అడిగారు. కుటుంబ సభ్యులంతా కోలుకున్నారు కదా? అని ఆరా తీశారు. కుశల ప్రశ్నలు వేసిన జగన్ కు.. బదులిచ్చిన అంజాద్.. భగవంతుని దయతో తామంతా కోలుకున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకున్నానని.. హైదరాబాద్ లో హలీమ్ తినేవాడినని చెప్పారు. కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత బాగా నీరసంగా ఉన్నట్లు చెప్పారు. సమావేశానికి ముందే.. పరామర్శలు చేసి.. వారిని ప్రత్యేకంగా ప్రశ్నలు వేసిన వైనం అందరిని ఆకర్షించింది.