సీఎం జగన్ చర్యల కత్తి బయటకు తీశారా?

Update: 2020-02-09 09:30 GMT
చంద్రబాబు ముఖ్యంత్రిగా ఉన్న కాలంలో ఏపీ నిఘాకు చీఫ్ గా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారిక ఏబీ వెంకటేశ్వరరావు మీద సస్పెన్షన్ వేటు వేయటం తెలిసిందే. తాజాగా ఆయనపై పడిన వేటు రాజకీయ అంశంగా పలువురు ఆరోపిస్తున్నా.. ఆయనపై కంప్లైంట్లు పెద్ద ఎత్తున వస్తున్నాయని చెబుతున్నారు.

ఇలాంటి వేళ.. ఆయనపై వేటుతో పాటు.. చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే తరహాలో మరింతమంది ఉన్నతాధికారులకు తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది. ఐపీఎస్ అధికారులకే కాదు.. రానున్న రోజుల్లో బాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల మీద కూడా చర్యల వేటు వేలాడుతుందని చెబుతన్నారు.

బాబుకు దగ్గరగా ఉండి.. నిబంధనల్నిపక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తప్పవని స్పష్టంచేస్తున్నారు. ప్రస్తుతానికి కాస్త ఆగినా.. అంతిమంగా బాబు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన అధికారులకు రానున్న రోజుల్లో చుక్కలు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది. అధికారుల విషయంలో సీఎం జగన్ కరకుగా ఉండే వీలుందని.. బాబు హయాంలో చక్రం తిప్పిన వారికి తిప్పలు తప్పేలా లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. మరీ.. అంచనాలకు తగ్గట్లే సీఎం జగన్ నిర్ణయం ఉంటుందా? అన్నది కాలమే సరిగా సమాధానం చెప్పగలదు.
Tags:    

Similar News