ఏపీలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఉద్దేశించిన రైతు భరోసా పథకాన్ని పట్టాలెక్కిస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే జగన్ ప్రకటించిన నవరత్నాల్లో రైతు భరోసా కీలకమైనదేనని చెప్పాలి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా ద్వారా అందజేస్తామని నాడు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకానికి సంబంధించి విధివిధానాలను రూపొందించే పనిని అధికారులకు అప్పగించగా... ఆ పని ఇప్పటికే పూర్తి అయిపోయింది. వచ్చే నెల 15న లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ పథకం... నిజంగానే సాగు మొదలెట్టే సమయంలో అన్నదాతలు పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్న వాదన వినిపిస్తోంది.
రైతు భరోసా పథకం వల్ల ఉపయోగాలు సరే... మరి ఈ పథకం విధివిధానాలు ఏమిటన్న విషయానికి వస్తే... ఈ పథకంలో ఒక్కో రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏడాదికి రూ.12,500 సాయం అందుతుంది. నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోనే ఈ సొమ్ము జమ అవుతుంది. ఈ రూ.12,500లలో ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ద్వారా అందే రూ.6000లకెు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో రూ.6,500 అందజేస్తుంది. మొత్తంగా రూ.12,500లను రైతు ఖాతాలో జమ చేస్తుంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి అర్హత సాదించని కౌలు రైతులు, పెద్ద రైతులకు మొత్తం రూ.12,500లను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది.
ఇక ఈ పథకంలో లబ్ధిదారుల గుర్తింపునకు పెద్ద కసరత్తే జరగనుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామాల్లో రైతు భరోసాకు అర్హులైన రైతులు - కౌలు రైతులను ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈ సందర్భంగా లబ్దిదారుల ఆధార్ కార్డులు - బ్యాంకు ఖాతాలు - రేషన్ కార్డు వివరాలను సేకరిస్తారు. గ్రామ స్థాయిలో లబ్దిదారుల జాబితాలు సిద్ధమయ్యాక... అదే గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి జాబితాలపై అభ్యంతరాలు - కొత్తగా చేరికలకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత గ్రామ స్థాయి నుంచి మండలాలకు చేరే జాబితాలను తహశీల్దార్ నేతృత్వంలోని మండల కమిటీ మరోమారు పరిశీలిస్తారు. ఆ తర్వాత డివిజనర్ స్థాయిలోనూ ఓ దఫా పరిశీలన జరగగా... చివరగా జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో జాబితాలను ఫైనలైజ్ చేస్తారు.
ఎంపిక సరే.. మరి ఈ పథకం కింద చేరాలంటే ఉండాల్సిన అర్హతలు ఏమిటన్న విషయానికి వస్తే...
% వ్యవసాయ - ఉద్యాన - పట్టు పరిశ్రమ సాగుదారులతో పాటు కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులే.
% దేవాలయ భూములను అధికారికంగా కౌలుకు తీసుకున్న కౌలుదారులు కూడా అర్హులే
% కౌలుదారులు తాము సాగు చేస్తున్న భూములు ఉన్న గ్రామాల్లోనే నివాసం ఉండాలి
% ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ రైతులు మాత్రమే అర్హులు
% ఎల్ ఈసీ - సీవోసీ లేని సాగుదారులు కూడా అర్హులే
% కుటుంబ సభ్యుల మధ్య లీజు అగ్రిమెంట్లు ఈ పథకం కింద చెల్లవు
% ఒక భూ యజమానికి ఒక కౌలుదారుతో మాత్రమే లీజు అగ్రిమెంటు కావాలి
% కౌలుదారు ఒక లీజు అగ్రిమెంట్ కంటే ఎక్కువ లీజులు చేసుకున్నా... ఒక యూనిట్ గానే పరిగణిస్తారు
% పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి అర్హత సాధించిన రైతులందరూ రైతు భరోసాకు అర్హులే
% భూ యజమానుల విషయంలో10 సెంట్ల నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉణ్న ప్రతి ఒక్క రైతుకూ ఈ పథకం వర్తిస్తుంది.
% కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది
% కౌలు రైతుల విషయానికి వస్తే.. 50 సెంట్లు అంతకంటే ఎక్కువ భూమిని సాగు చేస్తూ సొంతంగా భూమి లేని కైలుదారులు ఈ పథకానికి అర్హులు
% కౌలు రైతుల అర్హతకు భూ యజమాని అంగీకారం తప్పనిసరి
% ఒక భూ యజమాని తన భూమిని ఒకరి కంటే ఎక్కువ మంది కౌలు రైతులకు కౌలుకిస్తే... భూ యజమానితో పాటు ఒక కౌలు రైతుకు మాత్రమే అర్హత దక్కుతుంది
% డీ పట్టా భూముల్లో సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది
% ఆన్ లైన్ లో భూమి నమోదు కాని రైతుకు కూడా ఈ స్కీం వర్తిస్తుంది
% స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న గుమస్తాలు, ఫోర్త్ క్లాస్ సిబ్బంది, గ్రూప్ డీ సిబ్బందికి కూడా ఈ పథకం వర్తిస్తెంది