ఏపీలో రేషన్ డెలివరీ చేసే వాహనదారులకు జగన్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తి నెలా ఇచ్చే చెల్లింపుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క వాహనదారుడికి ప్రస్తుతం మొత్తం రూ.16 వేలు చెల్లిస్తున్నారు. అయితే , వారికి ఆ డబ్బులు సరిపోవు అన్న విషయం గ్రహించిన ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న డబ్బులకు అదనంగా మరో రూ.5వేలు చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు. గతంలో 16 వేల కి గాను అద్దె కింద రూ.10 వేలు, పెట్రోల్ నిమిత్తం రూ.3 వేలు, హెల్పర్ చార్జీల కోసం రూ.3 వేలు .. మొత్తం రూ.16వేలు ఇచ్చేవారు. అయితే , వారు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం అద్దెను రూ.10 వేల నుంచి రూ.13 వేలకు, వాహనదారుడి సహాయకుడికి చెల్లించే హెల్పర్ చార్జీలను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించింది. పెట్రోల్ కోసం రూ.3 వేలు చెల్లిస్తారు. అంటే రూ.16 వేలకు బదులు రూ.21వేలు అందజేయనున్నారు.
రేషన్ డెలివరీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. తహసీల్దార్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అధికారులకు నివేదికలు ఇవ్వాలి. ఒకవేళ శుభ్రంగా లేకపోతే అదనంగా చెల్లిస్తున్న మొత్తంలో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కాగా, రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం మొత్తం 9260 వాహనాలను అందజేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2300, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 700, బీసీ కార్పొరేషన్ ద్వారా 3800, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 660, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 1800 మందికి వాహనాలను అందజేశారు. ఒక్కో వాహనం ధర రూ.5,81,000 కాగా.. అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,48,600 అందింది. బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.1,74,357.. లబ్ధిదారుని వాటా కేవలం రూ.58 వేలే. బ్యాంకు లింకేజీ రుణం చెల్లించేందుకు వీలుగా పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా అద్దె చెల్లించేలా చేశారు.