విమ‌ర్శ‌ల్లో ట్రెండు సృష్టిస్తున్న జ‌గ‌న్‌

Update: 2018-03-29 18:10 GMT
తెలుగు రాష్ట్రాల్లో మంచి వ‌క్త‌లు త‌క్కువ‌గానే ఉన్నార‌ని చెప్పడానికి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవ‌స‌రం లేదు. స‌రిగ్గా చెప్పాలంటే అప్ప‌ట్లో ఎన్టీ రామారావు - త‌ర్వాత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి - ఇపుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఈ  ముగ్గురు త‌ర్వాత బాగా మాట్లాడేవారు ఉన్నారు గాని ఇంకా ఇంకా వినాలి అనిపించే వారు మాత్రం లేర‌నే చెప్పాలి. ఇక ఏపీలో ప్ర‌స్తుతం అన్ని పార్టీల అధ్య‌క్షులు ప్ర‌సంగాల్లో ర్యాంకులు వేస్తే వైఎస్‌ - కేసీఆర్ లంత కాక‌పోయినా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్ వ‌ర్త‌మానంలో మాత్రం మొద‌టి స్థానంలోనే ఉన్నార‌ని చెప్పొచ్చు. అయితే, పాద‌యాత్ర రాయ‌ల‌సీమ దాటిన‌ప్ప‌టి నుంచి వైఎస్ జ‌గ‌న్ మాట‌ల్లో - ప్ర‌సంగాల్లో చాలా కొత్త‌ద‌నం క‌నిపిస్తోంది. కేవ‌లం హామీలు చెప్పి వ‌దిలేయ‌డం లేదు. జ‌నాల‌కు న‌చ్చే కొత్త ప‌దజాలం - వ‌ర్త‌మాన అంశాల‌ను గ‌మ‌నిస్తూ మ‌రీ ప్ర‌సంగిస్తున్నారు.

గుంటూరు జిల్లా పెద‌కూర‌పాడు ప్రాంతంలో ప‌ర్య‌టించిన జ‌గ‌న్ అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. అనంత‌రం అంద‌రినీ ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ ఇక్క‌డి పులిచింతలపాడు ప్రాజెక్టుతో రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోందని, దానికి కార‌ణం జ‌ల‌య‌జ్ఞ విధాత‌ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషే కారణమని  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే గురించి చ‌క్క‌టి వ్యంగ్యంతో జ‌నాలు కేరింత‌లు కొట్టేలా మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారంటే... #ఈ మ‌ధ్య ఎం.ఎల్‌.ఎ. అని ఒక సినిమా వ‌చ్చింది. ఎం.ఎల్‌.ఎ. అంటే మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయ‌ట‌. మ‌న ఎమ్మెల్యేకి మీనింగ్ ఏంటో తెలుసా...? *మామూళ్లు - లంచాలు తీసుకునే అబ్బాయి* అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాట చెప్పిన వెంట‌నే జ‌గ‌న్ చిరున‌వ్వు న‌వ్వ‌గా... జ‌నం ఈల‌లు వేశారు.  ఇసుక రీచుల నుంచి దేన్నీ వ‌ద‌ల‌డం లేదు. ఇష్టం వచ్చినట్లుగా తవ్వేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబుకు ఇంత వాటా అని లెక్కలేసుకుని ప‌ద్ద‌తిగా అవినీతి చేస్తున్నారు. ఇంత వ‌సూళ్లు ఉంటే... అవినీతి చేసేవాళ్లు భయపడతారా అని ప్ర‌శ్నించారు. ఈ ప్రభుత్వం నేత‌లు నదులు, ఇసుక, ఇలా దేన్నీ వదిలిపెట్టలేదు. చివరికి దేవుడి భూములను కూడా టీడీపీ సర్కార్ వదిలిపెట్టడం లేదని విమ‌ర్శించారు.

ఇక మొన్న స‌త్తెన‌ప‌ల్లిలో ప‌ర్య‌టిస్తున్న‌పుడు కూడా జ‌గ‌న్ మాటల్లో వాడి క‌నిపించింది. దేశంలో జీఎస్టీ, రాష్ట్రంలో టీఎస్టీ, స‌త్తెన‌ప‌ల్లిలో కేఎస్టీ... అంటూ జ‌న‌రంజ‌కంగా చెప్పారు. జ‌గ‌న్ సాధార‌ణ జ‌నం నాడి ప‌ట్టుకుంటున్నారు, రాష్ట్రంలో ప్ర‌తి అణువు, ప్ర‌తి విష‌యంపై అవ‌గాహ‌న పెంచుకుంటున్నార‌న‌డానికి ఈ ఉదాహ‌ర‌ణ చాలు. వైసీపీ అడ్డుకోక‌పోతే సదావర్తి సత్రం భూములు 84 ఎకరాలు అప్ప‌నంగా మింగేసేవార‌ని ఎపుడు ఎక్క‌డ ఏ విష‌యం చెప్పాలో... అలా జ‌గ‌న్ చాలా సూటిగా ప్ర‌సంగిస్తున్నారు. వైఎస్‌లాగా సంద‌ర్భానుసారం ప్ర‌సంగాల్లో న‌వ్వుతూ, న‌వ్వులు పూయిస్తున్నారు. చూస్తుంటే.. ఎన్నిక‌ల నాటికి వైఎస్ వంటి రాటుదేలిన వ‌క్త‌లా జ‌గ‌న్ అవ‌త‌రిస్తార‌నిపిస్తోంది.
Tags:    

Similar News