ఏపీలో పదవులు ఇవ్వరు..తెలంగాణ లో ఇస్తారట

Update: 2018-05-29 08:14 GMT
 ఏపీ సీఎం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మరోసారి ఎత్తి చూపారు. జగన్ పాదయాత్రలో మాట్లాడుతూ ‘తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే 12 మంది ఎస్సీ - ఎస్టీ - బీసీ మహిళలకు మంత్రి పదవులు ఇస్తానని మహానాడులో తీర్మానం చేశారు. మీ మాటల్లో - చేతల్లో ఇసుమంతైనా నిజాయితీ ఉందా.? అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో మాత్రం ఎస్సీలకు - ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వరు. అధికారంలోకి రానే రాలేమని తెలిసినా పొరుగు రాష్ట్రంలో మాత్రం బీసీలను ముఖ్యమంత్రి చేస్తానంటున్నావు.. ఎస్టీలకు అధికసంఖ్యలో మంత్రి పదవులంటావ్.. ఇంతకన్నా అవకాశవాదం - మోసం ఉంటాయా.?’ అని మండిపడ్డారు.  ఇదే ప్రకటన ఆంధ్రప్రదేశ్ లో చేయాలని జగన్ ప్రశ్నించారు.

ఈరోజు జగన్ పాదయాత్ర భీమవరం సమీపాన ఉన్న వీరవాసరం నుంచి ప్రారంభమవుతుంది. తలతాడితిప్ప - మంతెపూడి క్రాస్ మీదుగా పాదయాత్ర సాగుతుంది. ఇవాళ్లి పాదయాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. నేటికి పాదయాత్ర ప్రారంభమై 175 రోజులు అవుతోంది. ఈ సందర్భంగా జగన్ పాదయాత్రను విజయవంతం చేస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు..

పాదయాత్రలో జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.  తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరోలా మాట్లాడుతున్న చంద్రబాబు బుద్దిని ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని  కోరారు. ఏపీలో తమ కులానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న బాబు.. తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తానంటే నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

మహానాడులో చేస్తున్న తీర్మానాలు - చెబుతున్న మాటలు వట్టి అబద్ధాలని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. కేవలం తన కుటుంబాన్ని, తన పార్టీ వాళ్లను కాపాడుకోవడానికే మాత్రమే చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News