పుస్త‌కాలివ్వ‌కుండా..కోడికూర ఏంటి బాబు:జ‌గ‌న్

Update: 2018-06-27 12:10 GMT
మింగ మెతుకు లేదు గానీ....మీసాల‌కు సంపెంగ నూనె అన్న త‌ర‌హాలో ఉంది ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పరిస్థితి. వినేవాడు వెర్రి వెంగ‌ళ‌ప్ప‌యితే....చెప్పేవాడు క‌చ్చితంగా చంద్ర‌బాబే అవుతాడ‌న్న కొత్త సామెత‌ను బాబుగారు నిజం చేస్తున్నారు. ఓ ప‌క్క నిధులు లేవంటూ వంద‌ల హాస్ట‌ళ్లు మూసివేయించిన చంద్ర‌బాబు......విద్యార్థుల‌కు భోజ‌నంలో కోడికూర పెడ‌తానంటూ ప్ర‌క‌ట‌న‌లివ్వ‌డం నిజంగా విడ్డూర‌మే. మ‌రోవైపు - విద్యా సంవ‌త్స‌రం మొద‌లైనా ....విద్యార్థుల‌కు పుస్త‌కాలు ఇవ్వ‌కుండా....చంద్ర‌బాబు ఇటువంటి జిమ్మిక్కులు చేయ‌డం హాస్యాస్పదం. ఈ నేప‌థ్యంలోనే - చంద్ర‌బాబుపై ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మండిప‌డ్డారు. హాస్టళ్లను మూసేసి విద్యార్థుల్ని రోడ్డు పాలు చేసిన చంద్రబాబు....రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో  విద్యార్థులపై సవ‌తి ప్రేమ చూపుతున్నార‌ని జ‌గ‌న్ దుయ్య‌బ‌ట్టారు. బాబుకు సంబంధించిన‌ ఓ అనుకూల పత్రిక - చంద్రబాబు పాంప్లీట్ ఈనాడులో తాను చ‌దివిన వార్త‌ల‌ను జ‌గ‌న్ తూర్పుగోదావ‌రిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భలో ఉటంకించారు.

అయితే, తాను పిల్లలకు కోడికూర పెట్టడం మంచి కార్య‌క్ర‌మ‌మేన‌ని, దానికి తాను వ్యతిరేకం కాద‌ని జ‌గ‌న్ అన్నారు. అయితే - హాస్ట‌ళ్లు - మ‌ధ్యాహ్న భోజ‌న నిర్వాహ‌కుల నిధుల విష‌యంలో ఇన్నాళ్లూ నిమ్మ‌కునీరెత్తిన‌ట్లున్న చంద్ర‌బాబు ఇపుడు ఓట్ల కోసం మ‌రోసారి ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఆచ‌ర‌ణ‌సాధ్యం కాని హామీలిస్తున్నార‌ని జ‌గ‌న్ అన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహ‌కుల‌కు 6 నెల‌లుగా నిధులు ఇవ్వ‌డం లేద‌ని - సరుకులకు - పుస్త‌కాల‌కు డ‌బ్బులు ఇవ్వ‌లేని చంద్ర‌బాబు కోడికూర పెడ‌తాన‌నడం శోచ‌నీయ‌మ‌న్నారు. ఎన్నికలు పూర్త‌య్యే వ‌ర‌కే కోడికూర ఇస్తారని - త‌ర్వాత విద్యార్థుల‌ చేతిలో చిప్ప పెడ‌తార‌ని ఎద్దేవా చేశారు. బాబు వచ్చిన తర్వాత జాబు రాక‌పోగా నిరుద్యోగం పెరిగింద‌ని, బాబు పాల‌న‌లో వ్య‌వ‌స్థ‌ అవినీతిమయమైందని మండిప‌డ్డారు. కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, చినబాబుకు, పెదబాబుకు లంచాలిచ్చి ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నార‌ని అన్నారు. ఇసుక‌తోపాటు మట్టి - బొగ్గు - కరెంట్ - రాజధాని భూములు, గుడి భూములు ....చివ‌ర‌కు గుడిలో న‌గల‌నూ చంద్ర‌బాబు దోచేస్తున్నార‌ని మండిప‌డ్డారు. పెన్షన్ - రేషన్ - మరుగుదొడ్లు ఇలా....ప్ర‌తీ పనికి లంచం వ‌సూలు చేస్తూ జ‌న్మభూమి కమిటీలు ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్నాయ‌ని నిప్పులు చెరిగారు.
Tags:    

Similar News