ఆంధ్రప్రదేశ్ లో వరుసగా హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ధోరణి పెరిగింది. అయితే ప్రభుత్వం దీనిపై సీరియస్ గా ఉన్నా ఈ ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు.
అప్పట్లో అంతర్వేది రథం దగ్ధం కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా విజయనగరం జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసమవడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఏపీలో విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. పోలీసులు మరింత కఠినంగా ఉండాలని హెచ్చరికలు పంపారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ దేవుళ్ల విగ్రహాలతో చెలగాటమాడే వారిని దేవుడే శిక్షిస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు దారుణం.. దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని జగన్ ఆరోపించారు. విగ్రహాల విధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
దీనిపై ఏపీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని.. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యలు ఉండాలని జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.