సందేహాలు వీడాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి, తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, వైఎస్ విజయమ్మ ఒక్కటయ్యారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా వీరంతా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలోని తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకోగా, విజయమ్మ, వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు. షర్మిల తన తండ్రి జయంతి సందర్భంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద వీరంతా ఆయనకు ఘన నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
జూలై 8న గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించిన కుటుంబ సభ్యులు స్మారకస్థూపం వద్ద జరిగిన కుటుంబ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కుమార్తె, కుమారుడు, వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రార్థనల అనంతరం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని పార్టీ ప్లీనరీ వేదిక వద్దకు చేరుకున్నారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి అక్కడికి చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో ప్లీనరీ తొలిరోజు ప్రారంభమైంది. వేదిక వద్ద తన తండ్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగన్ నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం ప్లీనరీని ప్రారంభించారు. ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. 2009, సెప్టెంబర్ 25న పావురాలగుట్టలో సంఘర్షణ మొదలైందన్నారు. ఓదార్పు యాత్రతో పార్టీ ఒక రూపం దాల్చిందని తెలిపారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందన్నారు.
మరోవైపు వైఎస్సార్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ప్లీనరీ వేదిక వద్ద ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు రక్తదానాన్ని సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు.