రాజకీయాలు వేరు చేసిన వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎట్టకేలకు ఆయన వర్థంతి సందర్భంగానే ఒక్కటైంది.. అన్నా-చెల్లిని ఒకే వేదికమీదకు తీసుకొచ్చింది. కలిసిపోయేలా చేసింది. తండ్రి వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా ఆయన బిడ్డలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిలలు కలిసిపోయారు. ఇద్దరూ కలిసే నివాళులర్పించారు. ప్రార్థనల్లో పక్కపక్కనే కూర్చున్నారు. దివంగత వైఎస్ఆర్ కు సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఇడుపుల పాయలోని తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముందు రోజే ఇడుపుల పాయ చేరుకున్న సీఎం జగన్ వైఎస్ఆర్ 12వ వర్థంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.
కొంతకాలంగా సీఎం జగన్-షర్మిల మధ్య ఏర్పడిన గ్యాప్ తో ఇద్దరూ ఎక్కడ కలిసిన సందర్భాలు లేవు. అయితే ఈ సారి తండ్రి వైఎస్ఆర్ వర్థంతికి నివాళి అర్పించేందుకు ఇద్దరూ ముందు రోజు సాయంత్రమే ఇడుపులపాయకు చేరుకున్నారు. దీంతో ఇద్దరూ కలిసి నివాళి అర్పించడంతో వివాదాలకు చెక్ పడింది.
జూలై 8న వైఎస్ఆర్ జయంతి నాడు జగన్, షర్మిల విడివిడిగా నివాళి అర్పించడంతో వైఎస్ఆర్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయన్న చర్చ సాగింది. దీంతో వైఎస్ఆర్ అభిమానులు ఇడుపుల పాయలో నివాళి కార్యక్రమంపైన ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ గ్యాప్ ఇక ఉండదనే విధంగా అన్నా-చెల్లి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం విశేషం.
- జగన్-షర్మిలను కలిపిన వైఎస్ఆర్ ఘాట్
వైఎస్ఆర్ వర్థంతికి జగన్, షర్మిల కలిసి నివాళులర్పించినా మునుపటి అంత దగ్గరి సంబంధాలు మాత్రం ఈసారి కనిపించలేదు. ఈ కార్యక్రమం తర్వాత ‘తాను ఒంటరిని అని.. ఒంటరిగా పోరాడుతున్నా’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేయడంతో జగన్ తో షర్మిల విభేదాలు ఇంకా సమసిపోలేదా? అన్న చర్చ మొదలైంది.
తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటును జగన్ వ్యతిరేకించారు. పొరుగు రాష్ట్రంతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్న తాము అక్కడి రాజకీయాల్లో జోక్యంచేసుకోబోమని జగన్ స్పష్టం చేశారు. అయితే షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. దీంతో జగన్, షర్మిల మధ్య గ్యాప్ పెరిగింది. ప్రతీ ఏటా తన అన్నకు రాఖీ కట్టి సెలబ్రేషన్స్ చేసుకొనే షర్మిల ఈసారి మాత్రం కేవలం ట్విట్టర్ ద్వారానే శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం. జగన్, షర్మిల విభేదాలు రచ్చకెక్కడంతో ఈసారి వీరిద్దరూ జాగ్రత్త పడ్డారు. రాజకీయంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలున్నా.. అన్నా, చెల్లెలుగా ఒక్కటిగా తండ్రికి నివాళి అర్పించడంతో ఇప్పుడు ఇది తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
-విజయమ్మ సభ ఎటువైపు?
తెలంగాణలో షర్మిల, ఏపీలో జగన్ పార్టీలతో ముందుకెళుతుండగా.. తాజాగా వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లో వైఎస్ఆర్ ఆత్మీయ సభ పేరిట ఆయన అభిమానులను దగ్గర చేసేందుకు నడుం బిగించారు. ఇది జగన్ కు సపోర్టుగానా? లేక షర్మిలకు మద్దతుగానా? లేక విజయమ్మనే స్వయంగా రాజకీయం చేస్తోందన్నా? అన్న ప్రశ్నలకు జవాబులు రావాల్సి ఉంది.
ఏపీ నుంచి గతంలో వైఎస్ఆర్ తో కలిసి పనిచేసి.. నేడు జగన్ కు మద్దతుగా ఉన్న వారు మాత్రం ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఇతర పార్టీలో ఉన్న నేతలు.. సినీ ప్రముఖులు ఇతర రంగాల వ్యక్తులను దాదాపుగా 350 మంది వరకు విజయమ్మ ఆహ్వానించారు. వారిలో ఎవరెవరు హాజరువుతారన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇది పూర్తిగా షర్మిలకు మద్దతుగా నిర్వహిస్తున్న కార్యక్రమంగా ప్రచారం సాగుతోంది. నాడు వైఎస్ ఆర్ తో పనిచేసిన వారు ఇప్పుడు పలు పార్టీల్లో ఉన్నారు.దీంతో విజయమ్మ ఆత్మీయ సమావేశం పైన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ నడుస్తోంది.