ఒక నేత విషయంలో మేం చెప్పే సానుకూల అంశాలు.. సదరు నేత వ్యక్తిత్వాన్ని.. ఆ నేత రాజకీయ పరిణితిని.. గొప్పతనాన్ని సర్టిఫై చేసినట్లు కాదు. నేతల వ్యక్తిగత.. రాజకీయ విధానాలు ఎలా ఉన్నా.. కొన్ని సందర్భాల్లో వారు ప్రదర్శించే టాలెంట్ ముచ్చట పడేలా ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలకు మేలు చేసేలా ఉంటుంది. అంతే తప్పించి.. సదరు నేత శుద్దపూస అన్న సర్టిఫికేట్ మేం ఇవ్వటం లేదన్న విషయాన్ని గుర్తించాలి. అదే సమయంలో ఇప్పుడు ప్రస్తావిస్తున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు నామా నాగేశ్వరరావును వేలెత్తి చూపించటం లేదన్నది మర్చిపోకూడదు. ఇంతకూ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. తాజాగా కేంద్రానికి చుక్కలు చూపించటంతో పాటు.. మాట్లాడటానికి పదాలు వెతుక్కోవాల్సిన పరిస్థితిని కల్పించిన నామాను మెచ్చుకోవాల్సిందే.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి ప్రస్తావించిన వెంటనే.. సూటి సమాధానం చెప్పే కన్నా.. సదరు రాష్ట్రానికి తాము ఏమీ చేయలేదన్న విషయాన్ని కవర్ చేసేలా.. తప్పు సదరు రాష్ట్రం మీదనే జరిగిందన్నభావన కలిగేలా మోడీ సర్కారు మాటలు ఉంటాయన్న ఆరోపణ ఉంది. ఈ వాదనకు తగ్గట్లే.. తాజా పరిణామాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.
ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై ఆ రాష్ట్ర టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నలకు అనుబంధ ప్రశ్నల్ని సంధించారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఒకప్పుడు టీడీపీలో ఉన్న ఆయన.. ఆ మధ్యన గులాబీ పార్టీలోకి చేరటం.. సార్వత్రిక ఎన్నికల్లో గెలవటం తెలిసిందే. ఏపీ ఎంపీ అడిగిన ప్రశ్నలకు సూటి సమాధానాలు చెప్పకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు ఉన్నాయన్న మాటను కేంద్రమంత్రి ప్రస్తావించటంపై నామా అభ్యంతరం వ్యక్తంచేశారు.
మంత్రి పదే పదే.. రాష్ట్రాల మధ్య గొడవలు ఉన్నాయన్న మాటలకు స్పందించిన నామా.. పదే పదే గొడవ ఉందని చెబుతున్నారు. వేటిపై గొడవ ఉందో స్పష్టంగా చెబితే వాటిని పరిష్కరించుకోవటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. కేంద్రమంత్రి చెప్పినట్లుగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని.. సమస్యల్ని పరిష్కరించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరిన విషయాన్ని గుర్తు చేయటం గమనార్హం.
పెండింగ్ లోని అంశాలన్ని కేంద్రం పరిధిలోనివే అని చెప్పిన ఆయన.. కేంద్రమంత్రి ఇరుకున పడేలా తన వాదనను వినిపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఈ రెండు అంశాలు ఆంధ్రాతో సంబంధం లేనివే అని చెప్పిన ఆయన.. కేంద్రం వీటికి సమాధానం ఇవ్వాలంటూ ఇరుకున పడేలా తన వాదనను వినిపించారు.
దీంతో.. కేంద్రమంత్రి తన మాటల్ని సర్దుకునే ప్రయత్నం చేశారు. తాను రెండు రాష్ట్రాల మధ్య గొడవ ఉన్నట్లు చెప్పలేదని.. ఇరు రాష్ట్రాలు కలిసి ఆలోచించుకోవాలని.. వారికి మద్దతు ఇవ్వటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా చూసినప్పుడు.. ఏపీకి అర్జెంట్ గా నామా లాంటి నేత అవసరమన్నది అర్థం కాక మానదు. సీనియార్టీతో పాటు.. కేంద్రాన్ని ఎప్పుడెలా ఇరుకున పెట్టాలన్న విషయం ఆయన తన మాటల్లో తాజాగా చూపించారని చెప్పాలి. ఏపీ ప్రయోజనాల కోసం జగన్ సర్కారు.. నామా లాంటి నేతను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.