కొంతమంది ఉన్నతాధికారులు మహా డేంజర్. తమ స్ధానాలు పదిలంగా చూసుకోవటం కోసం లేకపోతే మరింత పెద్ద పోస్టింగ్ కోసం ఎంతకైనా తెగిస్తారు. మంత్రులు కాదు ఏకంగా ముఖ్యమంత్రి కళ్ళను కూడా కప్పేయటానికి వెనకాడరు. వీళ్ళ మాటలతో జాగ్రత్తగా ఉండకపోతే చంద్రబాబునాయుడుకు జరిగిన నష్టమే జరుగుతుందనడంలో సందేహమే లేదు.
ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ ఉన్నతాధికారి తాజా మాటలు వింటుంటే అందరిలోను ఇదే అనుమానలు పెరిగిపోతున్నాయి. కేంద్రప్రభుత్వం మూడు రోజుల క్రితం ప్రకటించిన ’ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాకింగ్స్ లో ఏపికి మొదటిస్ధానం వచ్చింది. సరే ఈ ర్యాకింగ్ తమ కష్టానికి ప్రతిఫలమంటే కాదు తమ కృషి ఫలితమే అంటూ వైసిపి-తెలుగుదేశంపార్టీల నేతలు కీచులాడుకుంటున్నారు. ఎక్కడ పాజిటివ్ అంశమైనా తమ క్రెడిటే అని చెప్పుకోవటం రాజకీయపార్టీలకు బాగా అలవాటే కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.
కానీ ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ వివిధ వర్గాల్లో జగన్ పాలనపై 100 శాతం సంతృప్తి వ్యక్తమైన కారణంగానే ర్యాకింగ్స్ లో మొదటిస్ధానం వచ్చిందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ పరిపాలనపై పారిశ్రామికవేత్తలు నూరుశాతం సంతృప్తి వ్యక్తం చేశారట. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలపైన, పారిశ్రామిక విధానంపైన పారిశ్రామికవేత్తలు పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ఆ అధికారి చెప్పటమే కాస్త విచిత్రంగా ఉంది. పరిశ్రమల రంగంలో నేరుంగా సంబంధం ఉన్న పెట్టుబడిదార్లు, ఆడిటర్లు, లాయర్లు, ఆర్కిటెక్టుల వంటి స్టాక్ హోల్డర్లతో కేంద్రం సర్వే చేయించి ర్యాంకులు ప్రకటించిందని చెప్పటం వరకు ఓకేనే. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న పారిశ్రామికవేత్తలకు పదిరోజుల్లోనే భూమిని కేటాయిస్తున్నదట ప్రభుత్వం.
గడచిన 15 మాసాల్లో ఏపికి ఒక్క భారీ పరిశ్రమైనా వచ్చిందా ? పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నదా ? అన్నదే ప్రశ్న. పరిశ్రమల ఏర్పాటుకు చాలామంది ఎంవోయులు కుదుర్చుకుంటారు. కానీ పరిశ్రమఏర్పాటు దశకు వచ్చేసరికి చాలామంది వెనక్కు వెళ్ళిపోతారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు స్వీడన్ సంస్ధ ఆసక్తిగా ఉందని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారం వాస్తవం ఎప్పుడవుతుందో తెలీదు. జిందాల్ సంస్ధ కూడా బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమను తీసుకోవటానికి ఆసక్తిగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి ప్రచారాలు ఎన్ననైనా జరుగుతాయి. కానీ వాస్తవరూపం దాల్చేది మాత్రం చాలా కొన్ని మాత్రమే.
చంద్రబాబునాయుడు హయాంలో కూడా జనాలంతా సంతృప్తిగా ఉన్నారంటూ ఒకటే ఊదరగొట్టేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజిఎస్) అనేదాన్ని అడ్డం పెట్టుకుని అప్పట్లో ఓ ఐఏఎస్ అధికారి ప్రతిరోజు చంద్రబాబుకు నివేదికలు ఇచ్చేవాడు. అందులో ప్రభుత్వ పనితీరుపై జనాలు 85 శాతం తృప్తిగా ఉన్నారని, మరోరోజు 90 శాతం సంతృప్తిగా ఉన్నారంటూ కతలు చెప్పేవాడు. పిచ్చి సర్వేలనే చంద్రబాబు కూడా నిజమనుకుని వాటినే ప్రచారం చేసేవాడు. ఆ రిపోర్టులన్నీ అబద్ధాలని అప్పట్లో కొందరు నేతలు చెబితే వాళ్ళనే చంద్రబాబు తప్పు పట్టాడు. తీరా ఎన్నికల్లో ఏమైంది ? చరిత్రలోనే ఎప్పుడు లేనంత ఘోరంగా 23 సీట్లకు పరిమితమైపోయింది. ప్రజల సంతృప్తే నిజమైతే టిడిపికి 23 సీట్లకు ఎందుకు పరిమితమైపోయింది ? అధికారులను నమ్మిన చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చింది. కానీ చంద్రబాబుకు కతలు చెప్పిన అధికారి మాత్రం హ్యాపీగానే ఉన్నాడు. కాబట్టి అధికారులు చెప్పింది నిజమని ముఖ్యమంత్రులు గుడ్డిగా నమ్మేస్తే అంతే సంగతులు.
సరే... మీడియాతో ఎన్నయినా చెప్పొచ్చు కానీ ముఖ్యమంత్రులకు అయినా వీరు నిజాలు చెబితే బాటుంటుంది.