వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే నల్లమల మీదుగా వాతావరణం బాగా లేనప్పుడు ప్రయాణించి క్యూములోనింబస్ దట్టమైన మేఘాల ధాటికి హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన వాయిదా పడింది. వాతావరణం ప్రమాదకరంగా ఉండడం.. హెలిక్యాప్టర్ నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణం ఉండడం.. అక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ అధికారుల సమాచారంతో అధికారులు సీఎం జగన్ శ్రీశైలం పర్యటనను వాయిదా వేశారు.
ప్రస్తుతం కృష్ణ నదికి వరద పోటెత్తుతోంది. పరివాహకంలోని అన్ని ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. వరదతో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేస్తున్నారు. దీంతో భారీగా వరద ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలోనే శ్రీశైలం సందర్శన, రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా కీలక జలవనరుల సమీక్షను సీఎం జగన్ వాయిదా వేసుకున్నారు.
సీఎం వైఎస్ జగన్ శుక్రవారం శ్రీశైలాన్ని సందర్శించాలని మొదట షెడ్యూల్ రూపొందించుకున్నారు.. ఈ పర్యటనలో జగన్ వెంట జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ తాజాగా అది వాతావరణం బాగా లేకపోవడంతో వాయిదా పడింది. శ్రీశైలం ప్రాజెక్టు సందర్శన అనంతరం వైఎస్ జగన్ అక్కడే జలవనరుల శాఖ అధికారులతో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. పోతిరెడ్డిపాటు విస్తరణలో భాగంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభ పనులను జగన్ సమీక్షించడానికి రెడీ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. సుభాష్ ప్రాజెక్ట్స్ మ్యాను ఫాక్చరర్స్ లిమిటెడ్ ఈ పనులను దక్కించుకున్న విషయం తెలిసిందే.దీనికి వర్క్ ఆర్డర్ ను కూడా జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలపై వైఎస్ జగన్ ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు జగన్ పర్యటన వాయిదా పడడంతో ఈ కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి.