ఏపీలో మరికొద్ది వారాల్లోనే జరగనున్న మునిసిపల్ ఎలక్షన్స్ కి వైకాపా అధినేత జగన్ ఇప్పటి నుంచే ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఎన్నికలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలిసింది. ఫైనల్స్(2019 ఎన్నికలు)కు ముందు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి వీటిని ఆయన సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ వైకాపా సత్తా చాటాలని ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలో కొల్లగొట్టాలని ఆయన భావిస్తున్నారు. మొత్తం 7 నగరపాలక సంస్థలు - 5 పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రిపేర్ అవుతోంది.
మరికొన్ని రోజుల్లేనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రానుంది. దీనిపై సమాచారం అందుకున్న జగన్.. తన పార్టీ నేతలు - కార్యదర్శులతో భేటీ అయ్యారు. ఈ ఎన్నికలపై వారితో ఆయన చర్చించారు. ఈ ఎన్నికల ద్వారా వైపాకా సత్తా చాటాలని ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ వ్యతిరేకతను వైకాపాకు అనుకూలంగా మలుచుకునేలా క్షేత్రస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించినట్టు తెలిసింది. అదేసమయంలో స్థానిక సంస్థల్లో బలంగా ఉంటేనే రాబోయే రోజుల్లో అధికారం చేజిక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా జగన్ పేర్కొన్నట్టు తెలిసింది.
దీనిని బట్టి వైకాపా అధ్యక్షుడు జగన్ మునిసిపల్ ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించినట్టు భావించాలి. ఇదిలావుంటే, రెండు రోజుల కిందట కూడా మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలోనే వైకాపా అనుబంధ సంఘాల అధ్యక్షులతో ఆ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు.. ప్రభుత్వ వ్యతిరేకతను వైకాపాకు అనుకూలంగా మలుచుకులా దిశానిర్దేశం కూడా చేశారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలో వైకాపా ఎదుర్కొంటున్న సమస్యలపై వారు దృష్టి సారించారు. ఏదేమైనా.. సెమీఫైనల్స్ గా భావిస్తున్న స్థానికసంస్థల ఎలక్షన్స్ పై జగన్ ఇప్పటి నుంచే దృష్టి సారించారచడం ఆసక్తిగా మారింది.