తన సినీ మిత్రుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఎన్నికల రంగంలో దిగినప్పటికీ ఆయన్ను కాదని వైసీపీలో చేరారు ప్రముఖ నటుడు అలీ. కాకపోతే పోసాని - జీవిత రాజశేఖర్ - పృథ్విలా పార్టీ తరఫున గట్టిగా తన వాయిస్ వినిపించలేదు. రాకముందే తనకు మంత్రి పదవి ఇచ్చే పార్టీలో చేరతా అన్నారు. అయితే... సినిమా వేరు - రాజకీయం వేరు. ఏదేమైనా అలీ కోరుకున్నట్లు మంత్రి కాలేదు గానీ... జగన్ అందరికీ న్యాయం చేస్తున్నారు కాబట్టి అలీకి నామినేటెడ్ పదవి ఏదైనా ఇస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంతవరకు దానిపై ఎలాంటి కదలికా రాలేదు. అయితే.. తాజాగా జగన్ దీనిపై నిర్ణయం తీసుకున్నారని.. అధికారికంగా ప్రకటించడమే తరువాయని సినీవర్గాల నుంచి వినిపిస్తోంది.
అలీని ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ పిలిం - టెలివిజన్ - థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్’ అధ్యక్షుడిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే జగన్ నిర్ణయం తీసుకున్నారు... ఒకట్రెండు రోజుల్లో దీనిపై ప్రకటన రావొచ్చని సమాచారం. ఈ విషయం వైసీపీ వర్గాలతో పాటు సినీవర్గాల నుంచి కూడా వినిపిస్తోంది. అయితే, ప్రభుత్వం వైపు నుంచి కానీ అలీ వైపు నుంచి కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి కన్ ఫర్మేషన్ లేదు.
మరి అలీ ఈ పదవిలోకి వచ్చాక సినీరంగ అభివృద్ధి కోసం ఏం చేస్తారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.. ఓ సామాజికవర్గం చేతిలో ఉందని చెప్పే సినీ ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి. సినిమా వాళ్లకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదని మొన్న పృథ్వి చేసిన వ్యాఖ్యలు విన్నాం. అయినా జగన్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు... ఓటు వరకు రాజకీయాలు గాని.... ఇపుడు అన్నీ వ్యూహాలే. సినిమా రంగంలోనూ జగన్ అనే పేరు వినపడాలని... సినిమా వాళ్లకి ఇస్తున్న పదవులను బట్టి జగన్ భావిస్తున్నారనుకోవచ్చు. అంటే... ఏపీలో అన్ని విషయాల్లో తనదైన ముద్ర వేయాలనుకున్న జగన్ ఎవరూ ఎత్తుకోని అంశాలపై కృషి చేస్తున్నారు. ఏపీలో సినిమా ఆసక్తే గాని పరిశ్రమ లేదు. ఆ దిశగానూ జగన్ అడుగులు పడుతున్నట్టే ఉన్నాయి. అందుకే అలీ పార్టీకి చేసిన సేవలేమీ లేకపోయినా అతనికి తగిన గుర్తింపును ఇచ్చారు జగన్. భవిష్యత్తులో సినిమా రంగం కూడా ఏపీ వైపు చూసేలా జగన్ నిర్ణయాలు ఉంటాయని... అయితే... తొలి రెండేళ్లలో మాత్రం ఆ దిశగా ఏమీ ఉండవనుకోవచ్చు.