అసెంబ్లీకి జ‌గ‌న్‌.. కార‌ణం ఇదే!

Update: 2018-03-03 10:02 GMT
ఆ మ‌ధ్య ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో అసెంబ్లీకి తాను హాజ‌రు కానంటూ ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్ప‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ అసెంబ్లీకి వెళ్ల‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లా తాళ్లూరులోని ప్ర‌జాప్ర‌తినిధుల‌తో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు.

విభ‌జ‌న హామీల అమ‌లు కోసం ఎంపీలు పోరాటం చేస్తార‌ని చెప్పిన జ‌గ‌న్‌.. త‌మ ఎంపీలు చేసే పోరాటానికి నేత‌లంతా సంఘీభావం తెల‌పాల‌న్నారు. జంపింగ్ చేసిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశాన్ని వెల్ల‌డించారు.

తాను అసెంబ్లీకి వెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు. రాజ్య‌స‌భ‌కు జ‌రిగే ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు ఏపీ అసెంబ్లీకి వెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు. రాజ్యాంగ‌బ‌ద్ధంగా వ‌చ్చే ఓటుహ‌క్కును వినియోగించుకోవ‌టానికి వీలుగా ఒక రోజు అసెంబ్లీకి హాజ‌రుకానున్న‌ట్లు చెప్పారు.

పార్టీకి చెందిన 44 మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఎలాంటి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయో త‌న దృష్టికి వ‌చ్చింద‌న్న జ‌గ‌న్‌.. ఎవ‌రూ త‌న‌ను వేలెత్తి చూపించ‌ని రీతిలో రాజ‌కీయం చేస్తాన‌న్నారు. ఏపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పార్ల‌మెంటులో ఎంపీలు చేసే పోరాటానికి ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఇత‌ర నేత‌లు సంఘీభావం తెల‌పాల‌న్నారు.
Tags:    

Similar News