వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయ్యింది. ఇప్పటికే రెండు కీలక నామినేటెడ్ పదవులను జగన్ కేటాయించారు. వైవీ సుబ్బారెడ్డికి కీలకమైన టీటీడీ చైర్మన్ పదవి మొదట కేటాయించారు. ఇక వైసీపీ తరుఫున విస్తృతంగా ప్రచారం చేసిన ఫృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవిని జగన్ కేటాయించి న్యాయం చేశారు.
టీడీపీకి ఆది నుంచి సినీ నటుల సపోర్ట్ ఉంది.కానీ వైసీపీకే తక్కువ. కానీ పోయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుఫున ప్రచారం చేయడానికి చాలా మంది సీనీ ప్రముఖులు తరలివచ్చారు. ముఖ్యంగా అలీ అన్ని పార్టీలు తిరిగారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వారి పార్టీలో చేరుతానన్నారు. చివరకు వైసీపీలో చేరినా ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే ప్రచారం అయితే చేశారు. ఇప్పుడు ప్రతిఫలంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది.
జగన్ ఇప్పటికే టాలీవుడ్ నటుడు ఫృథ్వీని ఎస్వీబీసీ చైర్మన్ గా నియమించారు. ఇప్పుడు రేసులో వైసీపీ తరుఫున ప్రచారం చేసిన అలీ, పోసాని, జీవితా రాజశేఖర్, జయసుధ లాంటి ఎంతో మంది టాలీవుడ్ నటులున్నారు.
అయితే మొదటగా అలీకే కీలక పదవి దక్కబోతోందన్న ప్రచారం తాజాగా వైసీపీ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. మొన్నటి వరకు దీనిపై ప్రచారం జరిగినా పదవి మాత్రం దక్కలేదు. తాజాగా అలీ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, నాటక మండలి చైర్మన్ (ఎఫ్.డీ.సీ) చైర్మన్ పదవిని జగన్ ఖాయం చేశారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వెలువడనుందట.. సో అలీకి ప్రతిఫలం దక్కినట్టే కనిపిస్తోంది.