తనకు, చంద్రబాబుకు తేడా చెప్పిన జగన్

Update: 2020-12-01 14:38 GMT
ఏసీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాడివేడిగా సాగాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలాయి. చంద్రబాబు తీరును సభలో సీఎం జగన్ కడిగిపారేశారు. చంద్రబాబు విశ్వసనీయత గురించి సభలో జగన్ చీల్చిచెండాడు..

జగన్ మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం విశ్వసనీయతతో నడుస్తోందని.. జగన్ అనే వ్యక్తికి విశ్వసనీయత ఉందని.. ఒక మాట చెబితే జనం నమ్ముతున్నారని.. దటీజ్ జగన్ ’ అని అన్నారు. అదే చంద్రబాబు విశ్వసనీయత చూస్తే బాబు ఓ మాట చెబితే.. ఆ మాట ఖచ్చితంగా చేయడనేది చంద్రబాబు క్రెడిబిలిటీ’ అని జగన్ విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు, తనకు ఉన్న తేడాను జగన్ సభ సాక్షిగా చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో తాను 90శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేశామని.. అదే తన విశ్వసనీయతకు నిదర్శనం అని అన్నారు. తానుచెప్పిన తేదికి డబ్బులు అందని పరిస్థితి ఉందా అని సవాల్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం తమ నైజం అని అన్నారు.

రైతుల పక్షాన చంద్రబాబు సభలో బయటా మొసలి కన్నీరు కారుస్తున్నాడని జగన్ విమర్శించారు. తుఫాన్ తో నష్టపోయిన రైతులందరికీ సాయం అందజేస్తానని జగన్ హామీ ఇచ్చారు.

పేదలకు పక్కా ఇళ్లపై సభలో చర్చ సందర్భంగా చంద్రబాబు ఆరోపణలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక మనిషి వయసు పెరిగినా, స్పష్టంగా మేనిఫెస్టో అన్నది కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడుకి నరకంలో కూడా చోటు దొరకదని’ సీఎం నిప్పులు చెరిగారు.

సభ జరగకుండా.. సీఎం మాటలు జనాలకు చేరకుండా టీడీపీ సభ్యులు కుట్ర పన్ని సభాకార్యక్రమాలు అడ్డుకుంటున్నారని జగన్ విమర్శలు గుప్పించారు.




Tags:    

Similar News