ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ సీఎం చంద్రబాబు రికార్డుని బ్రేక్ చేయనున్నారు అనిపిస్తోంది. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ టూర్ చేసినట్లుగా చెప్పుకున్నారు. ఆయన నాలుగేళ్ళకు పైగా కేంద్రంలోని బీజేపీతో దోస్తీ చేశారు. మిత్రపక్షం కాబట్టి ఆయన ఢిల్లీకి అనేక పనుల మీద వెళ్ళి ఉంటారని అనుకున్నారు.
అదే విధంగా అప్పటికే విభజన గాయాలతో పచ్చిగా ఉన్న ఏపీకి సాయం కోసం కూడా తాను ఢిల్లీ టూర్లు పెట్టుకున్నాను అని చంద్రబాబు చెబుతూండేవారు. ఇపుడు జగన్ ఢిల్లీ టూర్లు అంతకు మించి అన్నట్లుగా మారిపోయాయి. నిజానికి చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసారు. కానీ జగన్ కి బీజేపీ మిత్రపక్షం కానేకాదు.
అందరి సీఎం ల మాదిరిగా జగన్ ఉన్నారు. అయినా సరే జగన్ గడచిన నాలుగేళ్ల కాలంలో అత్యధిక సార్లు ఢిల్లీ టూర్లు చేశారు. లెక్క చూస్త ఈపాటికే చంద్రబాబు 29 సార్ల ఢిల్లీ టూర్లను జగన్ అధిగమించి ఉంటారేమో అని అనే వాళ్ళూ ఉన్నారు.
జగన్ విషయానికి వస్తే బుధవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్తున్నారు. ఆయన ఈ శుక్రవారం కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని మోడీని కలసి చర్చలు జరుపుతారు అని అంటున్నారు. జగన్ ఇదే నెలలో 17వ తేదీన ఒకసారి ఢిల్లీ వెళ్ళారు. అపుడు కూడా ఆయన అమిత్ షాను, మోడీని కలసి వచ్చారు. పట్టుమని పద్నాలుగు రోజులు మాత్రమే అయింది. మరోసారి జగన్ ఢిల్లీ అంటున్నారు అంటే మ్యాటర్ ఏంటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా జగన్ తాను ఢిల్లీకి వెళ్ళింది పోలవరం ప్రాజెక్ట్ నిధుల కోసం, రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం అని చెప్పారు. తెలుగుదేశం సహా విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా తాను సరదా టూర్లు చేయడంలేదు అని గట్టిగా చెప్పుకున్నారు. అయితే జగన్ ఢిల్లీ టూర్ల విషయంలో గతంలో టీడీపీ విమర్శలు చేసింది.
ఆయన సొంత ప్రయోజనాల కోసం తప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్ళడం లేదు అని కామెంట్స్ చేసింది. దానికి బదులుగా జగన్ అసెంబ్లీలోనే పెదవి విప్పారు. ఈ నెల 17న జగన్ వెళ్ళి ప్రధానిని కలసినపుడు ప్రత్యేక హోదా సహా విభజన హామీలను నెరవేర్చాలని, ఏపీకి రావాల్సిన నిధులను పెద్ద ఎత్తున విడుదల చేయాలని పోలవరం రీ అంబర్స్ మెంట్ నిధులను ఇవ్వాలని కోరారని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలియచేసింది.
జగన్ ఇచ్చిన విన్నపాల మీద కేంద్రం ఏమి చేసింది ఏమి చేయలేదు అన్నది ఇంకా చూడాల్సి ఉంది. కానీ ఇంతలోనే మరో మారు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు అంటే చాలా కీలకమైన పర్యటనగానే దీన్ని చూస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు నవంబర్ లో జరుగుతాయని తెలుగుదేశం పార్టీ అయితే ప్రచారం చేస్తోంది. మరో వైపు చూస్తే వైసీపీలో అసమ్మతి ఎమ్మెల్యేలు సౌండ్ చేస్తున్నారు.
నలుగురుని సస్పెండ్ చేసినా ఇంకా ఎంతో మంది ఉన్నారని అంటున్నారు. అది చికాకుగా మారుతోంది. మరో వైపు చూస్తే అమరావతి రాజధాని మీద సుప్రీం కోర్టులో ఏమీ తేలడంలేదు. చాలా విషయాలు పెండింగులో పడ్డాయి. మూడు పట్టభద్రులు, ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ సీటు కూడా టీడీపీ గెలిచి జోష్ లో ఉంది. ఈ టైం లో ఏడాది పాటు ఆగితే కనుక మరింత ఇబ్బంది అవుతుంది అన్నది ఏమైనా వైసీపీలో ఉందేమో అని అంటున్నారు. దీంతో కేంద్ర పెద్దలతో ముందస్తు ఎన్నికల విషయం మాట్లాడుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే జగన్ సడెన్ గా ఢిల్లీకి వెళ్లడం మాత్రం ఆసక్తిని రేపుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.