అగ్ర‌న‌టుడితో జ‌గ‌న్ ప్ర‌త్యేక మంత‌నాలు

Update: 2016-06-11 09:29 GMT
ఏపీ ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి రాజ‌కీయంగా వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. రాజ‌కీయంగా ఒకింత సంక్లిష్ట‌ద‌శ‌లో ఉన్న జ‌గ‌న్ ఈ క్ర‌మంలో త‌న పార్టీని బ‌లోపేతం చేసేందుకు కొత్త మార్గాలు వెతుకున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఓ సినీదిగ్గ‌జంతో ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌త్యేక మంత‌నాలు జ‌రుపుతున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి.

విశ్వ‌స‌నీయ‌ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఇటీవ‌ల స‌ద‌రు సినీ ప్ర‌ముఖుడి ఇంటికి త‌ర‌చుగా వెళుతూ వివిధ అంశాలపై చ‌ర్చిస్తున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌ - రాజ‌కీయ‌వ‌ర్గాల్లో విస్తృత ప‌రిచ‌యాలు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న ఆశీస్సులు జ‌గ‌న్ కోరుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు సీనియ‌ర్ న‌టుడికి ఆశిస్సులు త‌న పార్టీలోకి ఆహ్వానించిన‌ట్లుగా చెప్తున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఈ అంశంపై ప్రాథ‌మిక చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని అయితే స‌రైన స‌మ‌యం కోసం వారు ఎదురుచూస్తున్నార‌ని స‌మాచారం. ఈ చ‌ర్చ‌లు ఫ‌లిస్తే స‌ద‌రు సినీ ప్ర‌ముఖుడి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ త్వ‌ర‌లో ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా ఇటీవ‌ల పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు పార్టీని వీడిన నేప‌థ్యంలో పార్టీకి తిరిగి పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ల స‌ల‌హాలు తీసుకోవ‌డం - పార్టీకి సినీగ్లామ‌ర్ అద్ద‌డం వంటి వివిధ ర‌కాల ప్ర‌య‌త్నాలు జ‌గ‌న్ మొదలుపెట్టిన‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News