అదేంటీ... తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టచ్ లో ఉంటే... బాబుకు గానీ - టీడీపీకి గానీ ఎలాంటి ఇబ్బంది లేదా? నిజమే.... జగన్ తో ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నా.. బాబుకు గానీ - టీడీపీకి గానీ ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ వైనం గురువారం నాటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకుంది. స్పీకర్ ఎన్నిక - ఆ సీట్లో వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం కూర్చునే ఘట్టం సందర్భంగా అసెంబ్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన నిజంగానే ఆసక్తికరమే.
స్పీకర్ కు స్వాగతం పలికేందుకు విపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు వెళ్లని వైనంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి సంప్రదాయమని కూడా ఆయన బాబు తీరుపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా అసలు తాను తలచుకుంటే... టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదని కూడా జగన్ సంచలన వ్యాఖ్యలే చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన చాలా మంది తనతో టచ్ లో ఉన్నారని కూడా ఆయన చెప్పారు. ఓ ఐదుగురిని లాగేస్తే... టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తనకు చాలా మంది చెబుతున్నారని, అయితే తాను మాత్రం పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని, టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోనని చెప్పారు.
అంతగా టీడీపీ ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వస్తానని బలవంతపెడితే... టీడీపీ తరఫున దక్కిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి రావాలని సూచిస్తానని జగన్ చెప్పారు. ఈ లెక్కన అందిన ఎమ్మెల్యే పదవులను వదిలేసుకుని వైసీపీలోకి వచ్చే టీడీపీ ఎమ్మెల్యేలు ఉండరు కదా. అలా అంటే.. ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా పదవులను వదులుకుని పార్టీలు మారరనే చెప్పాలి. సో... ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ తో టచ్ లో ఉన్నా... చంద్రబాబు మాత్రం ఎలాంటి భయం లేకుండా సాగవచ్చన్న మాట.