మాట ఇవ్వటం అందరూ చేస్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం.. అది కూడా ప్రతికూల పరిస్థితుల్లో అందరికి సాధ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దారుణమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సంక్షేమ కార్యక్రమాల్ని క్రమం తప్పకుండా అమలు చేయటం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందేమో?
కరోనా మహమ్మారి దెబ్బకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైనప్పటికీ.. తాను మాట ఇచ్చినట్లుగా వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ఇవాళ 23.14 లక్షల మంది మహిళలకు వారి ఖాతాల్లో రూ.18,500 మొత్తాన్ని జమ చేయనున్నారు. ఒక విధంగా ఆ మహిళలందరికి ఇవాళ పండుగ రోజుగా చెప్పాలి.
నాలుగేళ్లలో రూ.18,500 చొప్పున రూ.74వేల ఆర్థిక సాయాన్ని అందించాలన్న సదుద్దేశంతో గత ఏడాది నుంచి ఈ పథకాన్ని మొదలుపెట్టారు. 45-60 ఏళ్ల వయసున్న ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీ మహిళలకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం కింద కిరాణాషాపులు.. గేదెలు.. ఆవులు.. మేకల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ రోజున (మంగళవారం) వర్చువల్ విధానంలో రూ.4339.39 కోట్లను లబ్థిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.దీంతో.. ఈ పథకం కోసం జగన్ సర్కారు రూ.8943.5 కోట్ల సాయాన్ని అందించింది. వెనుకబడిన వర్గాల వారిని ఆర్థికంగా చేయూతను ఇవ్వటం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలన్న జగన్ ప్రయత్నంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.