జ‌గ‌న‌న్న ఇళ్ల‌కు సిమెంట్‌, ఐర‌న్ ఇవ్వమంటోన్న వ్యాపారులు...!

Update: 2021-09-28 17:30 GMT
ఏపీ ప్ర‌భుత్వం ఎన్నో ప‌థ‌కాలను ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. లోటు బ‌డ్జెట్ ఉన్నా కూడా జ‌గ‌న్ సంక్షేమంతో పాటు చాలా ప‌థ‌కాల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఈ కోవ‌లోనే జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కం కూడా ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పూర్తి చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే క్షేత్ర‌స్థాయిలో మాత్రం జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కం ప‌రిస్థితి ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు. చాలా మంది ల‌బ్ధిదారులు తమ‌కు కేటాయించిన స్థ‌లాల్లో తాము ఇళ్లు క‌ట్టుకోమ‌ని తెగేసి చెపుతున్నారు. మ‌రి కొంద‌రు ప్ర‌భుత్వం ముందుగా చెప్పిన‌ట్టుగా త‌మ‌కు ఇళ్లు క‌ట్టించి ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇంకా ఏపీలో చాలా లే అవుట్ల‌లో అస‌లు ఇళ్ల నిర్మాణ ప్ర‌క్రియే స్టార్ట్ కాలేదు.

అయితే ప్ర‌భుత్వం ఎక్క‌డిక‌క్క‌డ క‌లెక్ట‌ర్ల‌కు టార్గెట్లు పెడుతోంది. దీంతో వాళ్లు ఆర్డీవోల‌ను, కింద మండ‌ల స్థాయి అధికారుల‌ను వాయించేస్తున్నారు. దీంతో వాళ్లు ల‌బ్ధిదారుల చేత ఇళ్ల నిర్మాణం ప్రారంభింప‌జేసేందుకు నానా పాట్లు ప‌డుతున్నారు. ఇక ఈ లే అవుట్ల‌లో బోర్లు, క‌రెంట్ లైన్ల ఏర్పాటు కోసం టెండ‌ర్ల వేసిన కాంట్రాక్ట‌ర్లు సైతం త‌మ ప‌నులు చేసేందుకు ముందుకు రావ‌డం లేదు. ఇక అధికారులపై తీవ్ర‌మైన ఒత్తిళ్లు ఉండ‌డంతో వారు దిక్కుతోచ‌క ఏదో ఒక ఆలోచ‌న చేస్తున్నారు.

ఏపీలో కొన్ని జిల్లాల‌లో ఆర్డీవోలు, ఇత‌ర అధికారులు వ్యాపారుల‌తో స‌మావేశ‌మై తాము ప్ర‌భుత్వం నుంచి బిల్లులు వ‌చ్చేలా చేస్తామ‌ని.. జ‌గ‌న‌న్న ఇళ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన సిమెంటు, ఐర‌న్ ముందుగా ఇవ్వాల‌ని కోరుతున్నారు. యా మందు న‌మ్మ‌కం ఉంచి ఈ ప‌ని చేయాల‌ని వారు వ్యాపారుల‌కు విన్న‌వించుకుంటున్నా వ్యాపారులు మాత్రం స‌సేమీరా అంటున్నారు. అస‌లు ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో ఏపీలో రోడ్లు వేసినా బిల్లులు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం లేక ఏ కాంట్రాక్ట‌రు కూడా ముందుకు రావ‌డం లేదు.. మేం రిస్క్ చేసి ముందు పెట్టుబ‌డులు పెట్ట‌లేమ‌ని ఖ‌రాఖండీగా చెప్పేస్తున్నారు.

కొంద‌రు అధికారులు వ్యాపారుల‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నా త‌మ‌కు ఏ కంపెనీ అప్పులు ఇవ్వ‌డం లేదని.. ముందుగా డ‌బ్బులు పంపితేనే త‌మ‌కు స్టీల్ వ‌స్తుంద‌ని తేల్చి చెప్పేస్తున్నారు. కానీ ల‌బ్దిదారులు మాత్రం త‌మ‌కు సిమెంట్‌, ఇసుక‌, ఐరెన్ ఇస్తేనే ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెపుతున్నారు. దీంతో పై అధికారుల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌.. ఏం చేయాలో తెలియ‌క అధికారులు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.


Tags:    

Similar News