కేసీఆర్ సర్కారుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ తీరు ఏ మాత్రం బాగోలేదని వారు ఆరోపిస్తున్నారు. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఆసుపత్రుల్ని సందర్శిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని ఫైర్ అవుతున్నారు.
తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించారు కాంగ్రెస్ నేతలు భట్టి.. జగ్గారెడ్డి ఇతరనేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా నియంత్రణలో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర సర్కారు విఫలమైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతను పసిగట్టి తాము పదే పదే హెచ్చరికలు జారీ చేశామని.. కానీ ముఖ్యమంత్రి మాత్రం పట్టించుకోలేదన్నారు.
తెలంగాణలో కరోనా వ్యాప్తికి కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు. కరోనాకు చెక్ పెట్టేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పిన కేసీఆర్ కనీసం వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. మెదక్ జిల్లాలో 4270 మంది కరోనా బాధితులు ఉంటే అందులో నాలుగు వేల మంది ఇళ్లలోనే ఐసోలేషన్ అవుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ కోవిడ్ పై యుద్ధం చేయటానికి బదులుగా అస్త్రసన్యాసం చేశారన్నారు. ఫామ్ హౌస్ లో పడుకొన్నారంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ ఉత్సవ విగ్రహంగా మారారన్న ఆయన.. మిగిలిన మంత్రులు కరోనాకు భయపడి ఇళ్లల్లో తలుపులు వేసుకొని నిద్రపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్ని చెప్పినా.. తమ మాటల్ని పరిగణలోకి తీసుకోవటం లేదన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు కేసీఆర్ మీద కస్సుబుస్సుమంటున్నారు.