సీఎం కావాలని ఎవరికీ ఉండదు..రేవంత్ ఒక్కడికే ఉంటదా!

Update: 2020-03-13 05:30 GMT
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. 111 జీవో విషయంలో రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు టీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ రేవంత్ రెడ్డి అనుచరులు ఫేస్ బుక్‌ లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారు. దీన్ని సహించేది లేదుఅని జగ్గారెడ్డి అన్నారు.

సమస్యలపై ఎవరైనా పద్దతి ప్రకారం పోరాడాలని , పార్టీలో రేవంత్ రెడ్డి ఒక్కడే తీస్‌మార్ ఖాన్ కాదని, ఆయన తీరుపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉందని, గవర్న్‌మెంట్ దగ్గర బలం ఉంది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా..ఇలాగే చేస్తారని, ఈ క్రమంలో తప్పులు చేయవద్దని సూచించారు. పీసీసీ పదవి కోసం ఆయన ఆరాటపడుతున్నారని.. తనకు కూడా పీసీసీ చీఫ్ పదవి కావాలని , కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలకు సీఎం పదవి కావాలని ఉందని, కానీ ఎవరు సీఎం కావాలో సోనియా, రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారన్నారు.

అలాగే రేవంత్ రెడ్డి అంత దమ్మున్న నేత అయితే , కొడంగల్ ఎందుకు ఓడిపోయారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం తాము చుక్కలు చూస్తున్నాం..పైసలు లేనిదే రాజకీయం నడువద్దన్నారు. అలాగే రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా ఆయన అనుచరులు నోరు మూసుకోవాలని.. చేసే పిచ్చి పిచ్చి ప్రచారం మానుకోవాలని జగ్గారెడ్డి హితవు పలికారు. పాస్ పోర్టు కేసులు, ఇతరత్రా విషయాల్లో తనపై ఆరోపణలు వచ్చాయని, తనను కూడా ఎప్పుడు జైల్లో పెడుతారో తెలియదని..దీనికి పార్టీకి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. ఫేస్‌ బుక్‌ లో ప్రచారంతోనే రేవంత్ రెడ్డి కొంపముంచుతున్నారని, ప్రభుత్వం మీద పోరాటం, కేసీఆర్‌కు వ్యతిరేక పోరాటం పక్కదారి పట్టి సొంత ఎజెండా ముందుకు వచ్చింది అంటూ మండిపడ్డారు. ఇకపోతే రేవంత్ రెడ్డి ని జగ్గా రెడ్డి విమర్శించడం ఇదే మొదటిసారి కాదు ..గతంలో కూడా రేవంత్‌ పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో సొంత డబ్బా కొట్టుకోవడం, జైలుకెళ్లాం కాబట్టి పదవులు వస్తాయని భ్రమలో ఉండడం రేవంత్‌ కు అలవాటై పోయిందని తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. మొత్తంగా తెలంగాణ లో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న ఈ సమయంలో నేతలందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా ...ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం గమనార్హం.
Tags:    

Similar News