గత కొద్దికాలంగా సంచలన కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్న కాంగ్రెస్ నేత - సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోమారు అదే రీతిలో ఘాటు కామెంట్లు చేశారు. తాజాగా టీఆర్ ఎస్ పార్టీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి లాక్ డౌన్ ప్రకటించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగలేకపోయినా.. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా తమ పార్టీ విమర్శించలేదని తెలిపారు. గవర్నర్ ను కలిసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనలు మాత్రమే చేశారు. అయితే, దానిపై టీఆర్ ఎస్ పార్టీ విమర్శలు చేయడం సరికాదు అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజల పక్షాన మాట్లాడటానికి ప్రతిపక్ష పార్టీగా తమకు బాధ్యత ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. "టీఆర్ ఎస్ లో ఎమ్మెల్యేలు డమ్మీ - మంత్రులు డమ్మీ. మంత్రులు కేసీఆర్ కు భజన చేసి పోతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా పెద్ద మాటలు - తప్పుడు మాటలు మాట్లాడాడు. సైనికులు జీతాల కోసమే పనిచేస్తారు అని అని కామెంట్ చేయడం ద్వారా సైనికులను అవమానించారు. ఇంతకు ముందు దాదాగిరి చేసిన లక్షణాలతో మాట్లాడుతున్న శ్రీనివాస యాదవ్ కు కేసీఆర్ ముందు మాట్లాడే దమ్ము ఉందా?" అని ప్రశ్నించారు. శ్రీనివాస్ యాదవ్ మంత్రి కాదు పహిల్వాన్ - ఆయన సైనికులకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
టీడీపీలో చంద్రబాబు దగ్గర పని చేసినప్పుడు కేసీఆర్ ను బట్టలిప్పి కొడతా అని శ్రీనివాస్ యాదవ్ అన్నాడని జగ్గారెడ్డి తెలిపారు. "ఇలాంటి వ్యక్తులు - మంత్రి పదవి తీసుకున్న వారు బఫూన్లు. కేసీఆర్ ను తిట్టినవారి అందర్నీ కేసీఆర్ తన చెప్పు కింద పెట్టుకున్నాడు. వారందరిని కేసీఆర్ చెప్పు కింద పెట్టి నలుపుతున్నాడు. కేసీఆర్ ను ఒకప్పుడు తిట్టి - ఇప్పుడు భజన చేస్తున్నాడు. శ్రీనివాస్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకోకపోతే బాగుండదు" అని పేర్కొన్నారు. కేసీఆర్ - హరీష్ రావు పైన పాస్ పోర్ట్ కేసులు ఉన్నాయని తెలిపిన జగ్గారెడ్డి వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.