తెలంగాణ ముందస్తు ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. అధికారం మాదంటే, మాదంటూ తెలంగాణ రాష్ట్ర సమితి - ప్రజాకూటమి ధీమాగా ఉన్నాయి. స్వతంత్రులు ఎటు వైపు మొగ్గుతారో వారే అధికారంలోకి రావడం ఖాయమని దాదాపుగా తేలింది. దీంతో స్వతంత్రులను ప్రసన్నం చేసుకుందుకు అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ఎన్నికలలో స్వతంత్రులుగా పోటీ చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్స్ ఎక్కువ మంది ఉన్నారు. దీంతో వారిని తమ వైపు తిప్పుకుందుకు కాంగ్రెస్ అధిష్టానం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కర్ణాటక శాసనసభ ఎన్నికలలో పన్నిన వ్యూహన్నే ఇక్కడ అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకు చెందిన మంత్రి - వ్యూహకర్తగా పేరున్న డి. శివకుమార్ ను కాంగ్రెస్ చాలాకాలంగా ఇక్కడే ఉంచింది. ప్రస్తుతం బెంగుళూరుకు వెళ్లిన ఆయన తిరిగి హైదరబాద్ వస్తున్నారు. శివకుమార్ సోమవారం రాత్రికి హైదారాబాద్ చేరుకుంటారు. ఆయనతో పాటు ఢిల్లీ నుంచి పార్టీ సినీయర్ నాయకుడు అహ్మద్ పటేల్ - గులాం నబీ ఆజాద్ వంటి సీనియర్లు కూడా హైదరాబాద్ వస్తున్నారు.
తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ఇక్కడి నాయకులతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. స్వతంత్రులే కీలకం కానున్న ఈ దశలో వారిని బుజ్జగించే పనిని కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ కు అప్పగించినట్లు సమాచారం. స్వతంత్రులు తమకు మద్దతు పలికితే వారికి కీలక పదవులతో పాటు భారీ నజరానా కూడా ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు చెప్తున్నారు. మరో వైపు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలిచి అసంతృప్తితో ఉన్నవారిని తమవైపు తిప్పుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డిని రంగంలోకి దించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం నాడు పగడ్బందీ వ్యూహ రచనతో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా తెలుగుదేశం అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సాయాన్ని కూడా పొందాలన్నది కాంగ్రెస్ నాయకుల వ్యూహం. మరి వీరి ఆశలు నెరవేరుతాయా లేవా అన్నది రేపు తెలుస్తుంది.
హంగ్ వస్తే ఒకవేళ ప్రజా కూటమికి మెజారిటీ రాకపోయినా ఎక్కువ సీట్లు వస్తే ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి అయిన తమనే ముందు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ ఏకంగా గవర్నర్‌ను కలిసి విన్నవించడం ఆశ్చర్యమే. తద్వారా గవర్నర్ విచక్షణకు చాయిస్ లేకుండా - తప్పకుండా రాజ్యాంగాన్ని మీరి ప్రవర్తించకుండా ముందరి కాళ్లకు బంధం వేసేశారు.